గ్రేటర్ వాసులకు అలర్ట్.. మూసి ముంచేత్తే అవకాశం.. జల మండలి హెచ్చరిక..

| Edited By: Jyothi Gadda

Jul 21, 2023 | 6:26 PM

ఒక్క హుస్సేన్ సాగర్ నుంచే నాలుగువేల క్యూసెక్కుల వరద మూసిలో చేరుతుండగా తాజాగా హిమాయత్ సాగర్ నుంచి 700 క్యూసెక్కులు , అదేవిధంగా పలు నాళాల నుంచి దాదాపు మూడు నుంచి నాలుగు వేల వరద నీరు వచ్చి మూసిలో చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

గ్రేటర్ వాసులకు అలర్ట్.. మూసి ముంచేత్తే అవకాశం.. జల మండలి హెచ్చరిక..
Alert Sounded For Musi Rive
Follow us on

గత మూడు రోజులుగా కురిసిన వర్షాలతో జలాశయాలు జలకలను సంతరించుకుంటుండగా జలాశయాల నుంచి దిగువకు నీరును అధికారులు విడుదల చేస్తున్నారు. నగర శివారులోని జంట జలాశయాలది అదే పరిస్థితి. ఎగువన కురిసిన వర్షాలతో భారీ వరదనీరు వచ్చి చేరుతుండడంతో హిమాయత్ సాగర్ గేట్లు తెరిచి మూసీ నదిలోకి భారీ వరదను వదులుతున్నారు. దీంతో మూసి పరివాహక ప్రాంత ప్రజలకు జలమండలి హెచ్చరికలు జారీ చేసింద. మూసి వరద ఉధృతి దృష్ట అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను జలమండలి అధికారులు ఎత్తారు.

రిజర్వాయర్ రెండు గేట్లను ఒక ఫీటు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. 700 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ కు 700 క్యూసెక్కుల వదర నీరు వస్తోంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.760 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.15 అడుగులు ఉంది.

జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినందున ఎండీ దానకిశోర్ సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

నగరంలో పలు నాలాల నుంచి మూసి లోకి వచ్చి చేరుతున్న వరద నీటికి ఈ హిమాయత్ సాగర్ నుంచి వస్తున్న నీరు అదనం కావడంతో నగరంలో మూసి ఉదృతంగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా చాదర్ఘాట్ , మూసారాంబాగ్ బ్రిడ్జిల వద్ద ప్రవాహం ఉధృతిని తలపిస్తోంది.

మరోవైపు హుస్సేన్ సాగర్ సైతం ఫుల్ ట్యాంక్ లెవల్ కు రీచ్ అవ్వడంతో తూముల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సర్ప్స్ నాలా ద్వారా హుస్సేన్ సాగర్ వరద నీరు సైతం మూసిలో వచ్చి చేరుతోంది. ఒక్క హుస్సేన్ సాగర్ నుంచే నాలుగువేల క్యూసెక్కుల వరద మూసిలో చేరుతుండగా తాజాగా హిమాయత్ సాగర్ నుంచి 700 క్యూసెక్కులు , అదేవిధంగా పలు నాళాల నుంచి దాదాపు మూడు నుంచి నాలుగు వేల వరద నీరు వచ్చి మూసిలో చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు:

పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు

ప్రస్తుత నీటి స్థాయి : 1762.75 అడుగులు

రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు

ప్రస్తుత సామర్థ్యం : 2.650 టీఎంసీలు

ఇన్ ఫ్లో : 1200 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో : 700 క్యూసెక్కులు

మొత్తం గేట్ల సంఖ్య : 17

ఎత్తిన గేట్ల సంఖ్య : 02

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..