
నిజామాబాద్, జులై 9: మద్యానికి బానిసైన కన్న తల్లి ముక్కు పచ్చలారని కన్నా కూతురినే కడతెరిచింది. అభం శుభం తెలియని బోసి నవ్వుల చిన్నారిని దుప్పటి కప్పి గొంతు నులిమి చప్పేసింది. హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంకుంది. వివరాల్లోకెళ్తే..
భీంగల్ మండలం గోనుగొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్, రమ్యలకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి చిహ్నంగా ఐదు నెలల పండంటి ఆడ బిడ్డ జన్మించింది. ఆ చిన్నారికి ముద్దుగా శివాని అని పేరు కూడా పెట్టారు ఆ దంపతులు. మల్లేష్ ఓ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తు ఇంటిని పోషిస్తున్నాడు. అతని భార్య రమ్య కొన్ని నెలలుగా మద్యానికి బానిసయింది. రమ్యను మద్యం మానమని ఆమె భర్త మల్లేష్ ఎన్నిసార్లు చెప్పినా రమ్య మాత్రం తన అలవాటు మానలేదు. పైగా మద్యంకు బానిసైన రమ్య పాపను పట్టించుకోలేదు.
మద్యం మానుకుని పాపను పట్టించుకోమని.. లేకుంటే ఇంటి నుండి వెళ్ళపొమ్మని మల్లేష్ మందలించాడు. తాజాగా ఆ చిన్నారికి జ్వరం రావటం మద్యం కిక్కులో ఉన్న రమ్య మందులు పోయకపోవటంతో జ్వరం ఎక్కువైంది. దీంతో ఇంటికి వచ్చిన మల్లేష్ భార్యను మందలించాడు.
దీనితో రమ్య ఆదివారం రోజు ఫుల్లుగా మందేసి.. తాగిన మైకంలో ఆమె ఐదు నెలల కూతురు అయిన శివాని ని మొహం మీద దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. అయితే రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన భర్త కూతురు ఎక్కడ అనిఅడగగా కూతురు చనిపోయింది అని చెప్పింది. కూతురు శివాని ఎలా చనిపోయిందని అడగగా ఏదో పురుగు కుట్టి చనిపోయిందంటూ బుకాయించింది. అది నమ్మని భర్త మల్లేష్ గట్టిగా నిలదీయడంతో తాను చేసిన ఘనకార్యం బయటపెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రమ్యను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.