Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: టీ కాంగ్రెస్‌లో తుఫాను చల్లారేనా? సీనియర్లతో దిగ్విజయ్‌ సింగ్‌ విడివిడిగా మంతనాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభానికి తెరదించేందుకు దిగ్విజయ్ సింగ్ కసరత్తు మొదలైంది. కాసేపట్లో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. 10 గంటలకు గాంధీ భవన్ వెళ్లనున్న దిగ్విజయ్ సింగ్.. 11 గంటల నుంచి అందరి నాయకులతో విడి విడిగా సమావేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

Telangana Congress: టీ కాంగ్రెస్‌లో తుఫాను చల్లారేనా? సీనియర్లతో దిగ్విజయ్‌ సింగ్‌ విడివిడిగా మంతనాలు
Digvijay Singh
Follow us
Basha Shek

|

Updated on: Dec 22, 2022 | 9:31 AM

తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న ఏఐసీసీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను రంగంలోకి దించింది. 10 గంటల నుంచి గాంధీభవన్‌లో అసంతృప్తి నేతలతో దిగ్విజయ్‌సింగ్‌ చర్చించనున్నారు. ముందుగా సీనియర్లతో వరుస భేటీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రాజీనామా చేసిన జూనియర్లతో ఒకేసారి సమావేశం కానున్నారు దిగ్విజయ్‌సింగ్‌. నిన్న హోటల్లోనే అర్ధరాత్రి వరకు కోమటిరెడ్డితో పాటు మరికొంత మంది నేతలతో మాట్లాడారు దిగ్విజయ్. కాగా మరికాసేపట్లోనే దిగ్విజయ్‌ని కలవనున్నారు జానారెడ్డి. సుదీర్ఘ అనుభవమున్న జాతీయనేత.. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండంతో దిగ్విజయ్‌ని రంగంలోకి దించింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభానికి తెరదించేందుకు దిగ్విజయ్ సింగ్ కసరత్తు మొదలైంది. కాసేపట్లో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. 10 గంటలకు గాంధీ భవన్ వెళ్లనున్న దిగ్విజయ్ సింగ్.. 11 గంటల నుంచి అందరి నాయకులతో విడి విడిగా సమావేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు. భట్టి, జగ్గారెడ్డి, దామోదర, మధుయాష్కీతో.. చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో లోటుపాట్లపై ఆరా తీయనున్నారు.

కాగా పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌ను పలువురు సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో పలువురు నేతలు పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. వీళ్లందరితో మాట్లాడిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న హోటల్లోనే అర్ధరాత్రి వరకు కోమటిరెడ్డితో పాటు ఇంకొంతమంది నేతలతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ఇవాళ జానారెడ్డి సహా కీలక నేతలో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటల 30 నిముషాలకు మీడియాతో మాట్లాడనున్నారు దిగ్విజయ్ సింగ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..