Agnipatha Protest: ఆర్మీ లో రిక్యుట్మెంట్ కోసం.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) వేదికగా చేపట్టిన ఆందోళన.. అల్లర్ల విషయంలో ప్రధాన నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు.. రిమాండ్ ను విధించింది. ఈ విధ్వంసంలో సుబ్బారావు ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. అతనితో పాటు ముగ్గురు ప్రధాన అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురిపై రైల్వే యాక్ట్ తో పాటు 26 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రైల్వే కోర్టులో సుబ్బారావుతో పాటు.. ముగ్గురిని కూడా హాజరుపరిచారు. వాదనలు విన్న రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇదే విషయంపై రైల్వే ఎస్పీ అనురాధ స్పందిస్తూ.. రైల్వే స్టేషన్ లో విధ్వసం సృష్టించడానికి పక్కా స్కెచ్ వేశారని.. ముందుగా 10కి పైగా వాట్స్అప్ గ్రూపులు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూపు పేరుతో ఏర్పాటు చేసి.. భారీ ప్లాన్ వేశారని తెలిపారు. అంతేకాదు.. సికింద్రాబాద్ అల్లర్ల తర్వాత సాక్ష్యాలను సుబ్బారావు తారుమారు చేశారని అన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం చేయడానికి సుబ్బారావు యువకులను రెచ్చగొట్టారని తెలిపారు. బోడుప్పల్ లోని ఎస్వీఎం గ్రాండ్ లాడ్జిలో బస చేసిన సుబ్బారావు.. విధ్వంసానికి చెందిన వార్తలను చూసి.. చాలా సంతోషపడ్డారని.. అనంతరం ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని సూచించారని.. అనురాధ తెలిపారు. అల్లర్ల వెనుక తన పాత్ర బయటపడకుండా వాట్సప్ గ్రూపులలోని మెసేజ్ లను డిలీట్ చేయడమే కాదు..అనుచరులు పంపిన వాట్సాప్ గ్రూపు మెసేజ్లను డిలీట్ చేసి.. గ్రూప్ నుంచి ఎగ్జిట్ అందరికీ సూచించినట్లు అనురాధ చెప్పారు. అల్లర్లతో అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుందని భావించి ఇంతటి భారీ విధ్వసం సృష్టించినట్లు.. తద్వారా ప్రైవేట్ ఆర్మీ అకాడమీలు నష్టాల బారిన పడకుండా ఉంటాయని సుబ్బారావు భావించి ఇంతటి భారీ కుట్రకు తెర లేపినట్లు పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..