నిన్నటి వరకు ఐస్‌క్రీం, నేడు పాలు.. భాగ్యనగరాన్ని చుట్టుముట్టిన కల్తీపాల వ్యాపారం.. గుట్టలుగా కెమికల్స్ సీజ్‌..

|

May 11, 2023 | 12:00 PM

హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, ప్రమాదకర రసాయినాలతో పెద్దఎత్తున కల్తీ పాల తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. మహేందర్ అనే వ్యక్తి నుంచి 300మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ సీజ్‌ చేశారు. 10 కేజీల ధోల్పూర్ స్కీమ్ పాల పౌడర్ స్వాధీనం చేసుకున్నారు.

నిన్నటి వరకు ఐస్‌క్రీం, నేడు పాలు.. భాగ్యనగరాన్ని చుట్టుముట్టిన కల్తీపాల వ్యాపారం.. గుట్టలుగా కెమికల్స్ సీజ్‌..
Milk
Follow us on

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరూ భావిస్తారు. కానీ, ప్రజల నమ్మకాన్ని సొమ్ముచేసుకుంటూ, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు కల్తీగాళ్లు. కల్తీ పాలను తయారు చేసిన మార్కట్లో విక్రయిస్తున్నా వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం పాటు నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు స్వీట్స్ షాపులకు అతడు కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

దేశంలో పాల వినియోగానికి, పాల ఉత్పత్తికి ఏమాత్రం సంబంధం లేదు. డిమాండ్ వందశాతం ఉంటే.. ఉత్పత్తి 50శాతం లోపే. మరి మిగతా 50% పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అందుకు సమాధానమే ఇలాంటి కల్తీ పాలు. ఇళ్లలోకి, హోటళ్లలోని, టీస్టాళ్లలోకి రోజు వందలు, వేల లీటర్ల పాలు కావాలి. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకోడానికి మహేందర్ అనే వ్యక్తి పెట్టిన వ్యాపారమే కల్తీపాలు. ఒక్కరోజులో అతని నుంచి 80లీటర్లు స్వాధీనం చేసుకున్నారంటే అసలు ఎన్నిరోజుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాడు. ఎన్ని వేలు లీటర్లు పాలు అమ్మాడు. ఆ కల్తీపాలను ఎంతమంది వినియోగించారు. ఎంతమంది అనారోగ్యం బారిన పడ్డారు. అనేది ఎవరికి ఊహకు కూడా అందని విషయం.

యాదాద్రి జిల్లా భీమనపల్లిలో వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ పాల వ్యాపారి మహేందర్‌ వద్ద ఏకంగా 80 లీటర్ల కల్తీపాలు స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, ప్రమాదకర రసాయినాలతో పెద్దఎత్తున కల్తీ పాల తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. మహేందర్ అనే వ్యక్తి నుంచి 300మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ సీజ్‌ చేశారు. 10 కేజీల ధోల్పూర్ స్కీమ్ పాల పౌడర్ స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..