వారి ఉసురు తగలకుండా పోతుందా.. 17 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్‌లో 17 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఉద్యోగ మోసగాడు వెంగళ్ళ రమేష్ బాబును ఎట్టకేలకు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2009లో నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేసి పరారైన రమేష్ బాబుపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.

17 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని ఎన్బీడబ్ల్యూ వారంట్‌తో ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బు దోచుకున్నాడు. ఆ తర్వాత పరార్ అయ్యాడు.. అయినా కూడా డబ్బు కట్టిన ఆ నిరుద్యోగుల ఉసురు తగలకుండా పోతుందా.. 17 ఏళ్ల తర్వాత కూడా పోలీసులకు చిక్కారు, ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2009లో ఆదిలాబాద్ పట్టణంలో వీఆర్ ఎక్విప్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్వహించిన సంస్థ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి పలువురు నిరుద్యోగుల వద్ద ఒక్కొక్కరి నుండి రూ.20,000 నుంచి రూ.25,000 వరకు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు నిందితుడు వెంగళ్ళ రమేష్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి.
అప్పట్లోనే నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో బెయిల్‌పై బయటకు వచ్చి పరారయ్యాడు. దాదాపు 17 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అవడంతో వన్‌టౌన్ పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్ట్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
