మూడోసారి కూడా ఆడబిడ్డనేనని లింగ నిర్ధారణ కావడంతో అబార్షన్ చేయించుకునే ప్రయత్నంలో శ్రీవాణి అనే గర్భిణి మృతి చెందింది. జనగామలోని ఓ నర్సు ఇంట్లోనే అబార్షన్ చేయగా తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయింది. భర్త ఫిర్యాదుతో స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు, నర్సు సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.