Adilabad: అయ్యో.. మాటలకందని విషాదం.. ఊగుతున్న ఊయలే ఉరి తాడైంది..
వివరాల్లోకి వెలితే.. గ్రామానికి చెందిన కొడప జంగు-లక్ష్మి దంపతులకు ఒక తనయుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె విజయలక్ష్మి(13) చించుఘాట్ బాలికల గిరిజన స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతోంది. అయితే గత నెల రోజులుగా పాప స్కూలుకు వెళ్లటం లేదు. తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లాలని చెప్పిన.. వెళ్లనని మారాం చేస్తుంది.

ఆ ప్రకృతి రాసిన మరణ శాసనాన్ని తప్పించడం ఎవరి తరం కాదు. కానీ కొన్ని మరణాల గురించి విన్నా, చూసినా.. వారితో సంబంధం లేకపోయిన గుండెల్లో నుంచి దు:ఖం తన్నుకు వస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా అంకోలి పంచాయతీ సిరికొండ గ్రామంలో విషాద ఘటన వెలుగుచూసింది. ప్రమాదవశాత్తు ఊయల మెడకు బిగుసుకొని ఓ బాలిక ప్రాణాలు విడిచింది. ఊయలలో ఆడుకుంటుండగా.. గొంతుకు బిగుసుకుని విలవిల్లాడి అసువుల బాసింది. వివరాల్లోకి వెలితే.. గ్రామానికి చెందిన కొడప జంగు-లక్ష్మి దంపతులకు ఒక తనయుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె విజయలక్ష్మి(13) చించుఘాట్ బాలికల గిరిజన స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతోంది.
అయితే గత నెల రోజులుగా పాప స్కూలుకు వెళ్లటం లేదు. తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లాలని చెప్పిన.. వెళ్లనని మారాం చేస్తుంది. దీంతో పిల్లను ఏడిపించడం ఇష్టం లేక ఇంటి వద్దనే ఉంచుతున్నారు. జనవరి 9న ఎప్పటిలాగే తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి.. తొలి పిల్లలతో కలిసి ఆడుకుంది. ఇంట్లోనే కుర్చీపైకి ఎక్కి ఫ్యాన్‌కు చీరను ఊయలగా కట్టుకుంది. కాసేపు ఊయల ఊగుతూ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపింది.
ఆ తర్వాత పిల్లలంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విజయలక్ష్మి ఊయల ఊగుతుండగా.. ప్రమాదవశాత్తు చీర బాలిక మెడకు చుట్టుకుపోయి.. బిగుసుకుంది. దాన్ని చేధించలేకపోయింది పాప. దీంతో బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత పక్కింట్లో ఉండే మరో అమ్మాయి విజయలక్ష్మి చీరకు వేలాడుతూ ఉండటాన్ని గమనించింది. వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పగా.. వారు వచ్చి చూసేసరికి విగత జీవిగా మారిపోయింది. దీంతో పాప పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటి వరకు ఆనందంగా ఆడుతూ పాడుతూ తిరిగిన బాలిక..కొద్ది సేపట్లోనే మారటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..