Poonam Kaur meets Etela Rajender: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గతకొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈక్రమంలో తాజాగా పూనమ్ కౌర్ హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ఈటలతో పాటు ఆమె సతీమణి జమునతో కూడా ఆమె ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు సాధించిన ఈటలను ఘనంగా సత్కరించారు. కషాయం రంగు కండువా కప్పి సత్కరించి ఏక్ ఓంకార్ అనే మత పరమైన జ్ఞాపికను కూడా పూనమ్ అందజేశారు. సిక్కు మతగురువు గురునానక్ జయంతిని పురస్కరించుకొని ఆమె ఈటల ఇంటికి వెళ్లి అభినందించారు.
ఈ సందర్భంగా ఈటలతో కలిసి పూనమ్ కౌర్ శాంతి కపోతాలు పావురాలను గాల్లోకి ఎగురవేశారు. దీనిపై పూనమ్ కౌర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్లో ట్విట్ చేశారు. స్వేచ్ఛా భావనలకు నిదర్శనంగా పావురాళ్లను ఎగురవేసినట్లు ఆమె తెలిపారు. ఆత్మగౌరవం, దయ, అంకితభావం ఉన్న వ్యక్తులను గురునానక్ ఎప్పుడూ దీవిస్తాడంటూ పూనమ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా.. నటి పూనమ్ కౌర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో భేటీ కావడంపై పలు ఊహగానాలు మొదలయ్యాయి.
‘fight of righteousness has always won’
On the occasion of #gurunanakjayanti2021
present symbol of ‘ek Onkar’ #interfaithharmony to our dear #etalarajender Garu .#peace #love #harmony pic.twitter.com/3a5XUaICYg
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 19, 2021
#GuruNanakJayanti2021 pic.twitter.com/iXqERxcWag
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 19, 2021
Also Read: