లక్షల్లో జీతాలు.. పెద్దమొత్తంలో వసూళ్లు.. సిసిఎస్ ప్రక్షాళన వెనుక రహస్యం ఇదే..
హైదరాబాద్ పోలీస్ విభాగంలో అత్యంత కీలకమైనది సిసిఎస్ విభాగం. ఇందులో కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడిన కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఇటీవల కాలంలో వరుసగా రియల్ ఎస్టేట్ ఫ్రాడ్లు, ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసాల పేరుతో జరుగుతున్న వేలకోట్ల రూపాయల స్కాములకు సంబంధించిన దర్యాప్తు సీసీఎస్ అధికారులు చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేస్తారని వందల మంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్న తరుణంలో కొందరు పోలీస్ అధికారులు తప్పుదోవ పడుతున్నారు. ఏకంగా బాధితుల దగ్గరే చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

హైదరాబాద్ పోలీస్ విభాగంలో అత్యంత కీలకమైనది సిసిఎస్ విభాగం. ఇందులో కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడిన కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఇటీవల కాలంలో వరుసగా రియల్ ఎస్టేట్ ఫ్రాడ్లు, ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసాల పేరుతో జరుగుతున్న వేలకోట్ల రూపాయల స్కాములకు సంబంధించిన దర్యాప్తు సీసీఎస్ అధికారులు చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేస్తారని వందల మంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్న తరుణంలో కొందరు పోలీస్ అధికారులు తప్పుదోవ పడుతున్నారు. ఏకంగా బాధితుల దగ్గరే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా పోలీసుల చర్య చూసి బాధితులు న్యాయం కోసం వెళ్లి అన్యాయం అయిపోయామంటూ లబోదిబోమంటున్నారు.
సిసిఎస్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. సాహితీ ఇన్ఫ్రాస్ట్ స్కామ్‌తో పాటు పలు రకాల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులను సిసిఎస్ విభాగంలోని అన్ని టీములు దర్యాప్తు చేస్తున్నాయి. వేలకోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న కేసులు కావటంతో దర్యాప్తు పూర్తి చేసేందుకు సహజంగానే సమయం పడుతుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక కారణం చెప్పి బాధితుల దగ్గర నుండి డబ్బులు కోరుతున్నారు. మరికొన్ని ప్రాపర్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఇద్దరి మధ్య సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తూ కోట్ల రూపాయలు తమ వెనుక వేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల కాలంలో వరుసగా అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. ఒకవైపు ఏసీబీ దూకుడు చూసైనా సిసిఎస్‌లో ఉన్న కొందరు అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. యదేచ్చగా బాధితుల నుండి కోట్ల రూపాయల డబ్బులు లంచం రూపంలో స్వీకరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సిసిఎస్ ఏసిపిగా ఉన్న ఉమామహేశ్వరరావు వ్యవహారం అందరికీ తెలిసిందే. కీలకమైన కేసుల దర్యాప్తు చేస్తున్న అధికారిగా ఉన్న ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అతనికి మించి అక్రమాస్తులకు కూడా పెట్టుకున్నారు అనే ఆరోపణలతో ఆయనను ఏసిబి అరెస్టు చేసింది. ఇక తాజాగా ఒక సివిల్ వివాదంలో సిసిఎస్ పోలీసులు తల దూర్చారు. ఇరు పార్టీలు సెటిల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిసిన కేసు నమోదు చేశారు. కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షల రూపాయలు ఇవ్వాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఆయన పరుగులు తీశాడు. ఏకంగా మెయిన్ రోడ్డులోనే ఇంత భారీ మొత్తంలో లంచాన్ని స్వీకరించేందుకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిద్ధమయ్యాడు.
ఇలా కీలక కేసులు దర్యాప్తు చేస్తున్న సిసిఎస్ విభాగంలో అధికారులు అవినీతి బాట పట్టడం ప్రజల్లో గందరగోళానికి గురిచేస్తుంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కాస్త సెంట్రల్ కరప్షన్ స్టేషన్‌గా మారిందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో తమకు న్యాయం జరుగుతుందో లేదో అనే ఆందోళనలో బాధితులు ఉన్నారు. సిసిఎస్ మాజీ ఏసిపి ఉమామహేశ్వరరావు సిసిఎస్‌లో అన్నీతానై నడిపించాడు. కీలక కేసులు మొత్తం తన దగ్గరికి వచ్చేలా పావులు కదిపాడు. ఇక ఆయన బాటలోనే మరి కొంతమంది అధికారులు అవినీతిమయంగా ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ కేసులోనూ ఏసీపీలపై ఆరోపణలు వస్తున్నాయి. సుధాకర్ పైస్థాయి అధికారిగా ఉన్న ఏసీపీ రామ్ రెడ్డి పైన ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. బాధితుడు దగ్గర దొరికిన ఫోన్ రికార్డింగ్లో తన పైస్థాయి అధికారులకు కూడా ఇవ్వాల్సిందిగా ఇన్స్పెక్టర్ మాట్లాడిన కాల్ రికార్డింగ్‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే వ్యవహారంలో ఏసీపీ రామ్ రెడ్డిని సైతం ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
