Basara IIIT: బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

|

Jun 15, 2023 | 6:57 AM

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దీపిక ఆత్మహత్య ఘటన మరవకముందే మరో విషాదం చోటుచేసుకుంది. అందులో చదువుతున్న బూర లిఖిత అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన లిఖిత పియూసీ ప్రథమ సంవత్సరం చదవుతోంది.

Basara IIIT: బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
Death
Follow us on

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దీపిక ఆత్మహత్య ఘటన మరవకముందే మరో విషాదం చోటుచేసుకుంది. అందులో చదువుతున్న బూర లిఖిత అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన లిఖిత పియూసీ ప్రథమ సంవత్సరం చదవుతోంది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు గంగా బాలికల వసతి గృహంలో ఆమె 4వ అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుంచి దూకింది.

ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని మొదటగా క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లిఖిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఆమె మృతికి ట్రిపుల్‌ఐటీ అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అర్థరాత్రి కుక్కలు తరమడంతో నాలుగో అంతుస్తునుంచి ఆమె పడిపోయిందంటూ హాస్టల్ వార్డెన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి