బెయిల్ వచ్చినా.. పూచికత్తు దొరక్క ఇబ్బందులు.. దేశం కాని దేశంలో విడుదల కోసం ఎదురుచూపులు
తన పాప పట్ల శంకరయ్య అసభ్యంగా ప్రవర్తించాడని శ్రీలంక విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది సదరు మహిళ. శంకరయ్యకు తెలుగు తప్ప మరే భాష రాకపోవడంతో విమాన సిబ్బందికి తాను సాయం చేసిన విధానాన్ని చెప్పలేకపోయాడు. విమానం కొలంబోలో దిగిన వెంటనే విమాన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన శంకరయ్య గత 14 ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఓ కంపెనిలో పనిచేస్తూ వీసా పైన మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వచ్చి వెళుతుంటాడు. గత డిసెంబర్ నెల 12వ తేదీన రియాద్ నుండి ఎయిర్ లైన్స్ లో శ్రీలంక మీదుగా హైదరాబాద్‌కు వస్తుండగా అదే విమానంలో శ్రీలంకకు చెందిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కొలంబో వెళుతుంది. విమానంలో ఆమె పిల్లలు చలి కారణంగా ఇబ్బంది పడుతుండగా పక్కన ఉన్న శంకరయ్య స్పందించి క్యాబిన్‌లో ఉన్న బెడ్ షీట్ తీసి పాపకు కప్పాడు. అదే అతని పాలిట శాపమైంది.
అయితే తన పాప పట్ల శంకరయ్య అసభ్యంగా ప్రవర్తించాడని శ్రీలంక విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది సదరు మహిళ. శంకరయ్యకు తెలుగు తప్ప మరే భాష రాకపోవడంతో విమాన సిబ్బందికి తాను సాయం చేసిన విధానాన్ని చెప్పలేకపోయాడు. విమానం కొలంబోలో దిగిన వెంటనే విమాన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో శంకరయ్య తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా పొలాసలో ఉన్న భార్య గంగ లక్ష్మికి జరిగిందంతా చెప్పాడు. అక్కడి పోలీసులు శంకరయ్యను అదుపులోకి తీసుకుని కోర్ట్‌లో హాజరు పరచగా బెయిల్ మంజూరు అయింది. కానీ అక్కడి పౌరసత్వం ఉన్న ఇద్దరు పూచికత్తు ఇస్తే గాని విడుదల అయ్యేవకాశం లేదు. దీంతోపాటు కేసు విచారణ పూర్తయ్యే వరకు శ్రీలంక విడిచి వెళ్లలేదని అక్కడి కోర్ట్ ఆదేశాలుఇచ్చింది. కేసును మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది కోర్ట్.
ఇక అక్కడి వారు పూచికత్తి ఇచ్చినా, శ్రీలంక విడిచి వచ్చే పరిస్థితి లేకపోవడంతో శంకరయ్య పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పటిలోగా సౌదీ అరేబియా వీసా గడువు ముగియనుంది. శంకరయ్య అటు ఉపాధి కూలిపోయి చేయని తప్పునకు దేశం కాని దేశంలో మగ్గుతుండడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. ప్రభుత్వ స్పందించి శంకరయ్యను ఎలాగైనా వినిపించాలని అతని భార్య కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…