
హైదరాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్విగ్గీ డెలివరి బాయ్‌గా పనిచేసే యువకుడు ఆర్డర్ ఇచ్చేందుకు వచ్చి ఓ మహిళను లైంగికంగా వేధించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ఓ మహిళ ఇంట్లో మరో మహిళ పనిమనిషిగా పనిచేస్తోంది. ఓ రోజు ఆ పనిమనిషి ఆ ఇంట్లో ఎవరూ లేనప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్ ఆ ఇంటికి వచ్చి ఆర్డర్ ఇస్తుండగా ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె వెంటనే కేకలు వేయక ముందే అక్కడి నుంచి అతను పారిపోయాడు. ఈ సంఘటన జరిగిన అనంతరం ఆ ఇంటి యజమాని స్విగ్గీ డెలివరి యాప్‌కు ఫిర్యాదు చేసింది. కానీ స్విగ్గీ వాళ్లు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇంకో విషయం ఏంటంటే..అలా లైంగికంగా వేధించిన డెలివరి బాయ్ ఆ మహిళ కొడుకు కంటే కూడా వయసులో చిన్నవాడేనని.. ఇంటి ఓనర్‌కు చెప్పింది. అయితే మళ్లీ కొన్ని వారాల తర్వాత ఆ ఇంటి ఓనర్ స్విగ్గీ కస్టమర్ సర్వీస్ వాళ్లతో మాట్లాడింది. వాళ్లు కూడా సరిగ్గా స్పందిచకపోవడంతో రెండోసారి ఫిర్యాదు చేసింది. 48 గంటల్లో నిందితుడ్ని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేసింది. చివరికి స్విగ్గీ అధికారులు స్పందించారు. ఆ డెలివరీ బాయ్‌ను సస్పెండ్ చేశామని.. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇదిలా ఉండగా స్విగ్గీ వినియోగించేవాళ్లలో ముఖ్యంగా మహిళలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఏదైన సమస్య వచ్చినా కూడా స్విగ్గీ వాళ్లు స్పందించేందుకు చాలా ఆలస్యం చేస్తున్నట్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..