నాగరిక సమాజంలో అనాగరిక సంఘటన.. ఓ కుటుంభాన్ని వెలివేసిన గ్రామం.. అసలు విషయం ఏంటంటే..

|

Mar 15, 2021 | 9:51 PM

ఇదో అనాగరిక సంఘటన..ఓ వ్యక్తి తన సొంత బోరు మోటర్ నుంచి గత కొంత కాలంగా గ్రామస్తులకు నీటిని అందించాడు. ప్రస్తుతం నీటిని ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ వ్యక్తి కుటుంబాన్ని

నాగరిక సమాజంలో అనాగరిక సంఘటన.. ఓ కుటుంభాన్ని వెలివేసిన గ్రామం.. అసలు విషయం ఏంటంటే..
Village
Follow us on

family evicted from village : ఇదో అనాగరిక సంఘటన..ఓ వ్యక్తి తన సొంత బోరు మోటర్ నుంచి గత కొంత కాలంగా గ్రామస్తులకు నీటిని అందించాడు. ప్రస్తుతం నీటిని ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ వ్యక్తి కుటుంబాన్ని గ్రామస్తులతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బహిష్కరించారు. ఆ వ్యక్తితో మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు, 10 వేలు జరిమానా విధిస్తామని చాటింపు చేయించారు.

ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ..స్థానికంగా నివసిస్తున్న మాజీ కారోబార్ సురేందర్‌ రావు… తన స్థలంలో బోరు వేయించి దాని ద్వారా గ్రామస్తులకు నీటిని అందించాడు. ప్రస్తుతం నీటిని ఇచ్చేందుకు నిరాకరించి కోర్టును ఆశ్రయించాడు. దీంతో గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సురేందర్ రావు కుటుంబాన్ని బహిష్కరించారు. ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడవద్దు వారి ఇంటికి ఎవరు వెళ్ళకూడదు అని తీర్మానం చేశారు. అంతటితో ఆగలేదు.. సురేందర్ రావు కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడినా.. 25 చెప్పుదెబ్బలు, 10 వేల జరిమానా విధిస్తామని ఊరంతా చాటింపు వేయించారు… దీంతో సురేందర్‌ రావు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కుటుంబాన్ని ఇలా గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బహిష్కరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : ఆధారాలు లేని నిందలు, అధికారుల నిర్లక్ష్యం.. చేయని నేరానికి 20 ఏళ్లుగా జైలుశిక్ష.. బతుకు దారి కనిపించని బాటసారి..!

ఆరు క్రిమినల్ కేసులను దాచి పెట్టిన మమత, బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి ఫైర్

ఆస్ట్రేలియాలో మహిళలకు కోపం వచ్చింది. ఆడవారిపై అఘాయిత్యాలను ఆపాలంటూ నల్ల బట్టలు ధరించి నిరసన