AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: ఖమ్మం జిల్లాలో దారుణం.. కూతురు శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన తల్లిదండ్రులు..

ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన మానవ సమాజం తలదించుకునేలా చేసింది. తండ్రి ధీనగాధ కంటి కన్నీరు పెట్టిస్తుంది. అంబెలెన్స్ సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని

Khammam: ఖమ్మం జిల్లాలో దారుణం.. కూతురు శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన తల్లిదండ్రులు..
Khammam
Shiva Prajapati
|

Updated on: Nov 07, 2022 | 6:17 AM

Share

ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన మానవ సమాజం తలదించుకునేలా చేసింది. తండ్రి ధీనగాధ కంటి కన్నీరు పెట్టిస్తుంది. అంబెలెన్స్ సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని 50 కిలోమీటర్లు బైక్ పై తీసుకెళ్లాడు ఓ తండ్రి. అవును, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడో డెడ్‌ బాడీని బైక్‌పై తీసుకెళ్లారని, భుజాలపై మోసుకెళ్లారంటూ వార్తలు చూశాము. ఇప్పుడు అలాంటి ఘటనే ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆస్పత్రిలో ఫ్రీ అంబులెన్స్‌ లేక పోవడం.. ప్రైవేట్‌ అంబులెన్స్‌కి డబ్బులు ఇచ్చే స్థోమత లేక పోవడంతో.. కూతురు డెడ్‌బాడీని తండ్రి డైక్‌పై తీసుకెళ్లాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తోంది.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేక.. ప్రైవేట్ అంబులెన్స్ , ఆటోలకు డబ్బులు చెల్లించే స్తోమత లేక చనిపోయిన తన కూతురిని 50 కిలోమీటర్లు బైక్ పై తీసుకొచ్చాడు ఓతండ్రి. కూతురు మృతదేహాన్ని పొత్తిళ్లలో పెట్టుకొని దు:ఖాన్ని దిగమింగుకుంటూ బైక్ పై ప్రయాణించారు ఆబిడ్డ తల్లిదండ్రులు. వాగు దాటుకుంటూ చివరకు ఇంటికి చేరుకున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈవిషాద ఘటన మానవ సమాజాన్ని ఆలోచింపజేస్తుంది.

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామానికి చెందిన వెట్టి సుక్కి అనే ఆదివాసి గిరిజన బాలిక రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉచిత అంబులెన్స్ కోసం సిబ్బందిని సంప్రదించాడు. అంబులెన్న్ సౌకర్యం లేదని చెప్పడంతో ప్రైవేట్ అంబులెన్స్, ఆటోలకు పెద్ద మొత్తంలో చెల్లించలేక చనిపోయిన కూతురి మృతదేహాన్ని బైక్ పైనే తీసుకొస్తున్నానని చెప్పాడు తండ్రి.

75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఇంకా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధకరమంటున్నారు ప్రజలు. అభివృద్ధి దేవుడెరుగు.. ఇప్పటికి కొన్ని గిరిజన తండాలకు సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు ఆదివాసీలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!