Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ బ్యూటీ.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే
మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ బ్యూటీ ఒపల్ సుచత ఎంపికయ్యింది. ఈమెకు రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. టాప్-4లో మార్టినిక్, ఇథియోపియా, పోలెండ్, థాయిలాండ్ దేశాల అందగత్తెలు నిలవగా.. ఓపల్ అత్యుత్తమ సమాధానం చెప్పి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది.

నెలరోజులపాటు ఉత్కంఠగా సాగిన 72వ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్‌గా ముగిసాయి. థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్-8లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు. మిస్‌వరల్డ్ విజేతకు 8 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ దక్కనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, సినీ ప్రముఖులు మిస్‌వరల్డ్ ఫైనల్స్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ మిస్ వరల్డ్ పోటీల్లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఇక బ్యూటీ విత్ పర్పస్ విజేతగా మిస్ ఇండోనేషియా మోనికా కెజియా.. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సుధారెడ్డి ఎంపికయ్యారు. అటు సినీనటుడు రానా చేతుల మీదుగా సోనూసూద్ కి మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
