ప్రారంభమైన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే..! కిరీటం కోసం పోటీపడుతున్న 40 మంది సుందరీమణులు
హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 108 దేశాల నుండి 40 మంది అందాల పోటీదారులు కిరీటం కోసం పోటీ పడుతున్నారు. సోనూ సూద్, మెగాస్థారెడ్డి, జూలియా మార్లే వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ వంటి బాలీవుడ్ నటీనటులు ప్రదర్శనలిస్తారు.

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం ఈ పోటీల గ్రాండ్ ఫైనల్ జరగనుంది. హైటెక్స్ వేదికగా సాయంత్రం 6 గంటలకు మిస్‌వరల్డ్ గ్రాండ్‌ఫినాలే పోటీలు ప్రారంభం అయ్యాయి. 108 దేశాల సుందరీమణులు పోటీపడిన 72వ మిస్‌వరల్డ్ కాంటెస్ట్‌లో 40 మంది ఫినాలేకి చేరుకున్నారు. టాప్ 40 బ్యూటీలు, ఇవాళ కిరీటం కోసం పోటీపడనున్నారు. గ్రాండ్‌ఫినాలేలో మిస్‌వరల్డ్ సీఈవో జూలియా మార్లేతోపాటు సోనూసూద్, మెగా సుధారెడ్డిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.
మిస్‌వరల్డ్ గ్రాండ్ ఫినాలేకి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. బాలీవుడ్ స్టార్స్ జాక్వలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇదే వేదికపై సినీనటుడు సోనూసూద్‌కి మిస్‌వరల్డ్ ఆర్గనైజేషన్ బెస్ట్ హ్యుమానిటీరియల్ అవార్డు ప్రదానం చేయనుంది. మిస్‌వరల్డ్ ఫినాలేపై టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్. 3500 మంది అతిథులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని, ఇందులో వెయ్యిమంది విదేశీ అతిథులు ఉండగా.. వెయ్యిమంది సాధారణ ప్రజలకు అవకాశం కల్పించినట్టు చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
