Telangana: భూ తగాదాల ఘర్షణలతో ముగ్గురు హత్య

|

Jun 29, 2023 | 4:40 AM

కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం జక్కులపల్లిలో నాలుగు రోజుల క్రితం దారుణం వెలుగుచూసింది. భూ తగాదాలతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో 13మందిని అరెస్టు చేసినట్టు రెబ్బెన సీఐ నరేందర్‌, ఎస్సై భూమేష్‌ తెలిపారు.

Telangana: భూ తగాదాల ఘర్షణలతో ముగ్గురు హత్య
Death
Follow us on

కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం జక్కులపల్లిలో నాలుగు రోజుల క్రితం దారుణం వెలుగుచూసింది. భూ తగాదాలతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో 13మందిని అరెస్టు చేసినట్టు రెబ్బెన సీఐ నరేందర్‌, ఎస్సై భూమేష్‌ తెలిపారు. జక్కులపల్లిలో బక్కయ్యకు గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమి విషయంలో బక్కయ్య, మొంగయ్యకు గతం నుంచి గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఈనెల 25న బక్కయ్య భూమిలో పత్తి విత్తనాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న మొంగయ్య, అతని కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం.. కత్తులు, గొడ్డలి, రాళ్లు, కారం పొడితో సంబంధిత భూమిలోకి పోయి బక్కయ్య కుటుంబీకులపై దాడి చేశారు.

ఈ దాడిలో నర్సయ్య, బక్కక్కతోపాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మూడు హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఈ విషయంలో బక్కయ్య కుటుంబీకులు ఇందిర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేశారు పోలీసులు. హత్యకు పాల్పడిన మండల మల్లేష్‌, మండల గణేష్‌, మండల వెంకటేష్‌, భీంరావు, రాకేష్‌, రంగక్క, రజిత, మండల రజిత, రుక్మ, రాటె భూమక్క, భూడయ్య, దుర్గక్క, సౌమ్యపై ఐపీసీ 302, 307, 90, 147, 148 కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. హత్య చేసేందుకు ఉపయోగించిన గొడ్డళ్లు-3, కత్తులు-2, కర్రలు-4లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు రెబ్బెన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. నాలుగు ప్రత్యేక బృందాలతో నిందితులను పట్టుకొని అరెస్టు చేసి ఆసిఫాబాద్ కోర్ట్‌లో హాజరు పరిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.