Minister Talasani: హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్‌లో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి తలసాని ఈరోజు ప్రారంభించనున్నారు. విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా మార్చాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్‌లో దాదాపు 17 కోట్ల అంచనా వ్యయంతో 210 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు ప్రారంభించనున్నారు.
కాగా, 210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మొత్తం16 కోట్ల 27 లక్షలు ఖర్చు చేయగా, పదిహేనున్నర లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించారు. వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యంతో పాటు 15 దుకాణాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిన ప్రాంతానికి ‘డిగ్నిటీ కాలనీ’గా నామకరణం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..