Telangana: పాములు బాబోయ్‌ పాములు.. రాయిని కదిలిస్తే గుట్టలు గుట్టలుగా వచ్చేశాయ్..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గుట్టలు గుట్టలుగా ఉన్న పాములు కలకలం రేపాయి. వేములవాడ పట్టనంలోని సాయినగర్‌లోని ఓ ఇంట్లో పాములు తిష్ట వేశాయి. డ్రైనేజ్‌ రంద్రంనుంచి పాముపిల్ల బయటకు రాగానే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు.

Telangana: పాములు బాబోయ్‌ పాములు.. రాయిని కదిలిస్తే గుట్టలు గుట్టలుగా వచ్చేశాయ్..
Snakes Found In House

Updated on: Apr 05, 2023 | 1:17 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గుట్టలు గుట్టలుగా ఉన్న పాములు కలకలం రేపాయి. వేములవాడ పట్టణంలోని సాయినగర్‌లోని ఓ ఇంట్లో పాములు తిష్ట వేశాయి. డ్రైనేజ్‌ రంద్రంనుంచి పాముపిల్ల బయటకు రాగానే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతను వచ్చి డ్రైనేజీపై క్లోజ్‌ చేసి ఉంచిన రాయిని పైకి లేపగానే కుప్పలు తెప్పలుగా పాములు కనిపించాయి. ఒక్కసారిగా అన్నిపాములను చూసిన ఆ కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్రభయాందోళన చెందారు.

అమ్మో.. ఇన్నిపాములను ఎన్నడూ చూడలేదంటూ వాపోయారు. దాదాపు 25 పాము పిల్లలను ఓ డబ్బాలో బంధించి అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. ఎవరూ లేని సమయంలో పాము డ్రైనేజ్‌ రంద్రంగుండా లోపలికి వెళ్లి గుడ్లు పెట్టి ఉండొచ్చని పాములు పట్టే వ్యక్తి తెలిపారు. ఓ కుటుంబాన్ని పెనుప్రమాదం నుంచి కాపాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

ఇంట్లో బయటపడిన పాములకు సంబంధించిన దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us