AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెన్నా నది దగ్గర తవ్వకాలు జరపగా దొరికిన మిరిమిట్లుగొలిపే రాయి.. ఏంటా అని పరిశీలించగా

ఇద్దరు యువకులు తమ చెల్లెళ్ళ పెళ్లి జరిపేందుకు ఆలోచన చేస్తుండగా.. పెన్నా నది తీరం వెంబడి ఓ గని లీజుకు తీసుకున్నారు. తమ అదృష్టాన్ని ఎలాగైనా పరీక్షించుకోవాలని అనుకున్నారు. ఈలోపు తవ్వకాల్లో వారికి ఓ రాయి దొరికింది. అదేంటి అని చూడగా..

Viral: పెన్నా నది దగ్గర తవ్వకాలు జరపగా దొరికిన మిరిమిట్లుగొలిపే రాయి.. ఏంటా అని పరిశీలించగా
Penna River
Ravi Kiran
|

Updated on: Dec 10, 2025 | 11:48 AM

Share

కష్టపడి కుటుంబ బాధ్యతలు మోస్తున్న ఇద్దరు యువకుల కష్టం ఫలించింది. ఓ వజ్రం వారి తలరాతను రాత్రికి రాత్రే మార్చేసింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, తమ సోదరీమణుల వివాహాలు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్న ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉపశమనాన్నిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో వారు లీజుకు తీసుకున్న గనిలో జరిపిన తవ్వకాల్లో ఏకంగా రూ.50 లక్షల విలువైన వజ్రం దొరికింది.

పెన్నాలోని రాణిగంజ్‌కు చెందిన సతీశ్ మాంసం దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని స్నేహితుడు సాజిద్ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరివీ నిరుపేద కుటుంబాలు కావడంతో ఎన్నాళ్లు ఇలా కష్టపడాలి.. ఎప్పుడు మన కష్టాలు తీరుతాయి.. మన చెల్లెళ్ల పెళ్లి ఎలా చేయాలి అని బాధపడుతున్న వారికి ఓ ఆలోచన వచ్చింది. పెన్నాలోని ఓ గనిని లీజుకు తీసుకొని ఒక్కసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 20 రోజుల క్రితం ఓ చిన్న గనిని లీజుకు తీసుకుని తవ్వకాలు ప్రారంభించారు. గతంలో సాజిద్ తండ్రి, తాత కూడా వజ్రాల కోసం ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు. కానీ, ఈ స్నేహితుల ప్రయత్నం ఫలించింది. తవ్వకాలు చేస్తుండగా ఓ మెరిసే రాయి వారి కంటపడింది. దానిని వెంటనే స్థానిక డైమండ్ అధికారి వద్దకు తీసుకెళ్లారు. అధికారులు దానిని పరిశీలించి, 15.34 క్యారెట్ల నాణ్యమైన వజ్రంగా నిర్ధారించారు. మార్కెట్‌లో దీని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. త్వరలోనే ఈ వజ్రాన్ని వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలం ద్వారా వచ్చే డబ్బును చెరిసగం పంచుకోవాలని స్నేహితులిద్దరూ ముందే నిర్ణయించుకున్నారు. ఈ డబ్బుతో ముందుగా తమ సోదరీమణుల పెళ్లిళ్లు ఘనంగా చేస్తామని, మిగిలిన మొత్తంతో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటామని వారు సంతోషం వ్యక్తం చేశారు.

Diamond

తెలంగాణలో సల్మాన్ ఖాన్.. భారీగా పెట్టుబడి..
తెలంగాణలో సల్మాన్ ఖాన్.. భారీగా పెట్టుబడి..
ఇదేం వింత ఆచారం రా సామీ..!గాజు బాక్స్‌లతో సమాధులు.. అస్థిపంజరాలను
ఇదేం వింత ఆచారం రా సామీ..!గాజు బాక్స్‌లతో సమాధులు.. అస్థిపంజరాలను
పెన్నా నది తీరంలో తవ్వకాలు జరుపుతుండగా దొరికిన మిరిమిట్లుగొలిపే..
పెన్నా నది తీరంలో తవ్వకాలు జరుపుతుండగా దొరికిన మిరిమిట్లుగొలిపే..
1 కోటి కుటుంబాలకు బిగ్‌న్యూస్‌..పెన్షన్ సవరణపై ప్రభుత్వం క్లారిటీ
1 కోటి కుటుంబాలకు బిగ్‌న్యూస్‌..పెన్షన్ సవరణపై ప్రభుత్వం క్లారిటీ
కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు క్రికెటర్లు
కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు క్రికెటర్లు
దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
వచ్చే 3 రోజులు గజ గజ వణకాల్సిందే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వచ్చే 3 రోజులు గజ గజ వణకాల్సిందే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వరించిన అదృష్టం.. ఒక్కరోజులోనే కోటీశ్వరులైన ఇద్దరు మిత్రులు
వరించిన అదృష్టం.. ఒక్కరోజులోనే కోటీశ్వరులైన ఇద్దరు మిత్రులు
ఐపీఎల్ 2026 వేలంలో మరో వైభవ్ సూర్యవంశీ.. ఎవరీ వహీదుల్లా జాద్రాన్
ఐపీఎల్ 2026 వేలంలో మరో వైభవ్ సూర్యవంశీ.. ఎవరీ వహీదుల్లా జాద్రాన్
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి!