AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8th Pay Commission: 1 కోటి కుటుంబాలకు బిగ్‌న్యూస్‌.. పెన్షన్ సవరణపై ప్రభుత్వం క్లారిటీ!

8th Pay Commission: గత కొన్ని వారాలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లపై నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బంది ఎదురుచూస్తున్న వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ధృవీకరించింది..

8th Pay Commission: 1 కోటి కుటుంబాలకు బిగ్‌న్యూస్‌.. పెన్షన్ సవరణపై ప్రభుత్వం క్లారిటీ!
Subhash Goud
|

Updated on: Dec 10, 2025 | 11:46 AM

Share

8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పాటు అమలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. సుమారు 50 లక్షల మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మందికిపైగా పెన్షనర్లు.. ఈ వేతన కమిషన్ సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘం రావాల్సి ఉంటుంది. ఈ ఏడాదితో 7వ వేతన సంఘం ముగియాల్సి ఉండగా, తర్వాత 8వ వేతన సంఘం రావాల్సి ఉంది. అయితే దీని అమలులో జాప్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే వేతన సంఘంపై కేంద్రం ప్రకటన చేయగా.. వేతన కమిషన్ విధివిధానాలకు ఇటీవలే నవంబర్ నెలలో ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటినుంచి కమిషన్ విధివిధానాల ప్రకారం.. సిఫార్సులు చేయాల్సి ఉంటుంది.

గత కొన్ని వారాలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లపై నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బంది ఎదురుచూస్తున్న వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ధృవీకరించింది. ఎనిమిదవ వేతన సంఘం ప్రస్తుత ఉద్యోగుల జీత నిర్మాణాన్ని నిర్ణయించడమే కాకుండా పెన్షన్ సవరణలపై కూడా సిఫార్సులు చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Gold, Silver Prices: షాకింగ్‌ న్యూస్‌.. రూ.9 వేలు పెరిగిన వెండి.. బంగారం ఎంత పెరిగిందో తెలుసా?

ఇవి కూడా చదవండి

పెన్షన్‌లో ఏదైనా మార్పు వస్తుందా?

8వ వేతన సంఘం నిబంధనలలో పెన్షన్లు చేర్చిందా? లేదా అనేది ఉద్యోగి సంస్థలు, పెన్షనర్లకు ఉన్న అతిపెద్ద ప్రశ్న. అనేక ఉద్యోగి సంఘాలు గతంలో ప్రభుత్వానికి లేఖలు రాసి, పెన్షన్లను నిబంధనలలో స్పష్టంగా ప్రస్తావించాలని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదవ వేతన సంఘం చాలా విస్తృతమైనదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఇది జీతాలు, భత్యాలతో పాటు పెన్షన్లను సమీక్షిస్తుంది. దీని అర్థం కమిషన్ తన నివేదికను సమర్పించినప్పుడు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లను పెంచడానికి, ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయడానికి పూర్తి రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తుంది.

ఇది కూడా చదవండి: Post Office: భార్యాభర్తల కోసం అద్భుతమైన స్కీమ్‌.. రూ.2 లక్షల డిపాజిట్‌పై రూ.90 వేల వడ్డీ!

కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే సాధారణంగానే ఉద్యోగుల జీతం, పెన్షనర్ల పెన్షన్ గణనీయంగా పెరుగుతుంటుంది. అయితే ఇదే క్రమంలో కొంత కాలంగా.. ఉద్యోగుల డీఏ (డియర్‌నెస్ అలవెన్స్- కరవు భత్యం), పెన్షనర్ల డీఆర్‌ను (డియర్‌నెస్ రిలీఫ్) బేసిక్ పేలో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం ఈ ఆశకు పార్లమెంటులో ముగింపు పలికింది. కరువు భత్యాన్ని ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు. దీని అర్థం ప్రస్తుతానికి పాత జీతం గణన సూత్రం అమలులో ఉంటుంది. అలాగే ఉద్యోగులు ఈ విషయంలో మరికొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు.

ఇది కూడా చదవండి: Success Story: చదివింది 6వ తరగతి.. వినూత్న ఆలోచనలో అద్భుతమైన వ్యాపారం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెన్నా నది తీరంలో తవ్వకాలు జరుపుతుండగా దొరికిన మిరిమిట్లుగొలిపే..
పెన్నా నది తీరంలో తవ్వకాలు జరుపుతుండగా దొరికిన మిరిమిట్లుగొలిపే..
1 కోటి కుటుంబాలకు బిగ్‌న్యూస్‌..పెన్షన్ సవరణపై ప్రభుత్వం క్లారిటీ
1 కోటి కుటుంబాలకు బిగ్‌న్యూస్‌..పెన్షన్ సవరణపై ప్రభుత్వం క్లారిటీ
కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు క్రికెటర్లు
కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు క్రికెటర్లు
దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
వచ్చే 3 రోజులు గజ గజ వణకాల్సిందే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వచ్చే 3 రోజులు గజ గజ వణకాల్సిందే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వరించిన అదృష్టం.. ఒక్కరోజులోనే కోటీశ్వరులైన ఇద్దరు మిత్రులు
వరించిన అదృష్టం.. ఒక్కరోజులోనే కోటీశ్వరులైన ఇద్దరు మిత్రులు
ఐపీఎల్ 2026 వేలంలో మరో వైభవ్ సూర్యవంశీ.. ఎవరీ వహీదుల్లా జాద్రాన్
ఐపీఎల్ 2026 వేలంలో మరో వైభవ్ సూర్యవంశీ.. ఎవరీ వహీదుల్లా జాద్రాన్
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి!
వేలంలో రూ. 2 కోట్లు.. కట్ చేస్తే.. టీమిండియాను పేకాటాడేశాడుగా..
వేలంలో రూ. 2 కోట్లు.. కట్ చేస్తే.. టీమిండియాను పేకాటాడేశాడుగా..
విద్యార్థులకు శుభవార్త.. వరుసగా 6 రోజులు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. వరుసగా 6 రోజులు పాఠశాలలకు సెలవులు!