AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరీ దేవుడో ఇదేం వింత ఆచారం రా సామీ..! గాజు బాక్స్‌లతో సమాధులు.. అస్థిపంజరాలను చూస్తూ..

ప్రపంచవ్యాప్తంగా వివిధ అంత్యక్రియల ఆచారాలు ఉన్నాయి. కొన్ని మతాలలో మరణం తర్వాత మృతదేహాన్ని దహనం చేస్తారు. కొన్ని మతాలలో మృతదేహాన్ని స్మశానవాటికలో ఖననం చేస్తారు. ప్రపంచంలో అనేక దేశాలు మరణానంతరం శరీరాన్ని విద్యుత్ శ్మశానవాటికలో ఉంచి దహనం చేస్తున్నారు. కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న ఒక వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఎందుకంటే, ప్రపంచంలో మనిషి మరణం తర్వాత ఆ శరీరాన్ని ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా ఖననం చేస్తున్నారు.

Viral Video: ఓరీ దేవుడో ఇదేం వింత ఆచారం రా సామీ..! గాజు బాక్స్‌లతో సమాధులు.. అస్థిపంజరాలను చూస్తూ..
Transparent Graves Of China
Jyothi Gadda
|

Updated on: Dec 10, 2025 | 11:53 AM

Share

వైరల్‌ వీడియోలో మరణించిన వ్యక్తిని పారదర్శక సమాధులలో ఖననం చేయటం కనిపిస్తుంది. అక్కడి కుటుంబాలు తమ ప్రియమైనవారు అస్థిపంజరాలుగా మారడాన్ని చూస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. వైరల్ వీడియోలో చుట్టూ పారదర్శక స్మశానవాటికలు కనిపిస్తున్నాయి. అవి ఖననం చేయబడిన మానవుల అస్థిపంజరాలను చూపిస్తున్నాయి. ఈ పారదర్శక సమాధులలో ఒకేచోట ఇద్దరు వ్యక్తులను కూడా పూడ్చిపెట్టబడి కనిపిస్తున్నారు. అంటే భార్యాభర్తలు కలిసి మరణిస్తే, వారిని కలిసి ఖననం చేస్తారు.

నివేదికల ప్రకారం.. ఈ ఆచారం చైనాలోని ఒక మారుమూల గ్రామంలో జరుగుతుందని తెలిసింది. ఇది శతాబ్దాలుగా అమలులో ఉన్న సాంప్రదాయ ఆచారం. ఇలా గాజు బాక్స్‌లాంటి సమాధుల్లో తమ వారిని ఖననం చేయడం వారికి ఇచ్చే గొప్ప గౌరవంగా పరిగణిస్తారు. అనేక ఆసియా దేశాలలో ప్రజలు మరణం తర్వాత మృతదేహాలను ఒక ప్రత్యేక గదిలో ఉంచి, ఆచారాలు, సంప్రదాయాలను నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఇలాంటి ఆచారంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది భయపడ్డారు. చాలా మంది కామెంట్ల రూపంలో తమ భయాన్ని వ్యక్తం చేశారు. షాకింగ్‌ ఎమోజీలను పోస్ట్ చేశారు. అలాంటి దృశ్యాలను చూడవలసిన అవసరం నాకు లేదు అని ఒకరు రాయగా, తమ ప్రియమైనవారు ఇలా అస్థిపంజరాలుగా మారడాన్ని చూడాలని ఎవరూ అనుకోరు అంటూ మరికొందరు పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రాజశేఖర్‌కు షూటింగ్ లో ప్రమాదం.. డి కాలికి తీవ్ర గాయం
రాజశేఖర్‌కు షూటింగ్ లో ప్రమాదం.. డి కాలికి తీవ్ర గాయం
దివ్వెల మాధురిపై రీతూ తల్లి సెటైర్లు.. అబద్దాలు ఆడితే ఇలానే ఉంటది
దివ్వెల మాధురిపై రీతూ తల్లి సెటైర్లు.. అబద్దాలు ఆడితే ఇలానే ఉంటది
తెలంగాణలో సల్మాన్ ఖాన్.. భారీగా పెట్టుబడి..
తెలంగాణలో సల్మాన్ ఖాన్.. భారీగా పెట్టుబడి..
ఇదేం వింత ఆచారం రా సామీ..!గాజు బాక్స్‌లతో సమాధులు.. అస్థిపంజరాలను
ఇదేం వింత ఆచారం రా సామీ..!గాజు బాక్స్‌లతో సమాధులు.. అస్థిపంజరాలను
పెన్నా నది తీరంలో తవ్వకాలు జరుపుతుండగా దొరికిన మిరిమిట్లుగొలిపే..
పెన్నా నది తీరంలో తవ్వకాలు జరుపుతుండగా దొరికిన మిరిమిట్లుగొలిపే..
1 కోటి కుటుంబాలకు బిగ్‌న్యూస్‌..పెన్షన్ సవరణపై ప్రభుత్వం క్లారిటీ
1 కోటి కుటుంబాలకు బిగ్‌న్యూస్‌..పెన్షన్ సవరణపై ప్రభుత్వం క్లారిటీ
కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు క్రికెటర్లు
కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు క్రికెటర్లు
దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
వచ్చే 3 రోజులు గజ గజ వణకాల్సిందే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వచ్చే 3 రోజులు గజ గజ వణకాల్సిందే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వరించిన అదృష్టం.. ఒక్కరోజులోనే కోటీశ్వరులైన ఇద్దరు మిత్రులు
వరించిన అదృష్టం.. ఒక్కరోజులోనే కోటీశ్వరులైన ఇద్దరు మిత్రులు