Youtube: యూట్యూబ్ కొత్త రూల్స్..! ఇకపై అలాంటి వీడియోలకు ఒక్క పైసా కూడా రాదు..
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) లో కీలక మార్పులు జూలై 15 నుండి అమలులోకి వస్తున్నాయి. AI కంటెంట్, కాపీ చేసిన వీడియోలు, లో-క్వాలిటీ కంటెంట్‌కు ఇకపై ఆదాయం చెల్లించబోదు. ఒరిజినల్, మానవ క్రియేటివిటీతో కూడిన కంటెంట్‌కు మాత్రమే ఆదాయం లభిస్తుంది.

ఈ కాలంలో చాలా మంది యూట్యూబ్ ఛానెల్స్‌ను కూడా ఒక కెరీర్‌గా మల్చుకుంటున్నారు. మంచి కంటెంట్‌తో, క్రియేటివ్ ఐడియాస్‌తో వీడియోలు చేస్తూ.. వర్క్ స్యాటిస్‌ఫ్యాక్షన్ పొందడంతో పాటు మంచి ఆదాయం కూడా పొందుతున్నారు. కానీ, మరికొంత మంది ఇతరుల వీడియోలను కాపీ చేస్తూ, ఏఐ కంటెంట్‌తో, ఫేక్ థంబ్‌నైల్స్‌తో పెద్దగా కష్టపడకుంగానే కూడా యూట్యూబ్‌లో డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటికి యూట్యూబ్ ఇప్పుడు షాక్ ఇచ్చింది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) కి సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది. జూలై 15 నుండి కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. యూట్యూబ్ కొత్త పాలసీ ప్రకారం డూప్లికేట్ కంటెంట్ లేదా కాపీ చేసిన కంటెంట్‌కు ఇకపై యూట్యూబ్ ఆదాయం చెల్లించదు.
యూట్యూబ్ ఛానెల్ మానిటైజేషన్ పొందాలంటే వీడియోలు ఒరిజినల్ కంటెంట్‌తో ఉండాల్సిందే. ఇతరుల వీడియోలను ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడం, ఏఐ ద్వారా తయారుచేసిన స్లయిడ్ షోలను పోస్ట్ చేయడంతో వాటికి డబ్బులు రావు. క్లోన్ లేదా డూప్లికేట్ వీడియోలు, లో-క్వాలిటీ వీడియో కంటెంట్, క్లిక్‌బైట్ ఆధారిత వీడియోలు, కాపీ చేసిన, చిన్న మార్పులతో తిరిగి వాడిన వీడియోలకు ఇన్‌కమ్ ఉండదని యూట్యూబ్ తెగేసి చెప్పేసింది.
యూట్యూబ్ కొత్త పాలసీ ప్రకారం.. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం అసలైన కంటెంట్‌ను ప్రోత్సహించడం. ప్లాట్‌ఫామ్ ద్వారా ఏఐ కంటెంట్ కు చెక్ పెట్టడం. అలాగే, మానవ కృషిని ఆదరించడమే కాకుండా ఇతరుల కంటెంట్‌ను అనవసరంగా వాడి ఆదాయం పొందే పరిస్థితులను అరికట్టేందుకు ఈ మార్పలు చేసింది. జూలై 15 తర్వాత క్రింది రకాల వీడియోలు మాత్రమే ఆదాయానికి అర్హత పొందుతాయి. విద్యా సంబంధిత వీడియోలు, అసలైన వినోదాత్మక కంటెంట్ (మానవ క్రియేటివిటీతో తయారైనవి), స్వంతంగా రూపొందించిన వీడియోలు. జూలై 15 నుంచి “Bare Skin (Image Only)” అనే యాడ్ కేటగిరీని యూట్యూబ్ తొలగిస్తోంది. దీన్ని ఉపయోగిస్తున్న చానెల్స్ ఆగస్ట్ 15 లోపల తమ యాడ్ సెట్టింగులను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2025 జూలై 15 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




