AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: గూగుల్‌ సంచలన నిర్ణయం.. ఇక కొన్ని రోజులే టైం.. తర్వాత ఆ ఫీచర్‌ తొలగింపు!

ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో గూగుల్‌లోని ఒక ప్రత్యేక సేవను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఆగస్ట్‌ 25 తర్వాత ఈ సేవను వినియోగదారులు ఉపయోగించలేరని పేర్కొంది. అయితే గూగుల్‌ ఇంతకు దేన్ని తొలగించాలనుకుంటుంది. ఎందుకు తీసివేయాలనుకుంటుందో తెలుసుకుందాం పదండి!

Google: గూగుల్‌ సంచలన నిర్ణయం.. ఇక కొన్ని రోజులే టైం.. తర్వాత ఆ ఫీచర్‌ తొలగింపు!
Google
Anand T
|

Updated on: Aug 02, 2025 | 4:10 PM

Share

గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. వినియోగదారులు తమకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు గూగుల్‌లో సమాధానాలు వెతుకుతుంటారు. గూగుల్ ప్రతి క్షణం ప్రజలకు సహాయపడే అనేక సేవలను అందిస్తుంది. కానీ ఇప్పుడు గూగుల్ ఒక ప్రత్యేక సేవను శాశ్వతంగా తొలగించనుంది. గూగుల్ తన ప్రసిద్ధ సేవ అయిన గూగుల్ URL షార్ట్నర్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. పొడవైన URL లను తగ్గించేందుకు ఈ సేవ సహాయపడుతుంది. ఇది ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఈ లింక్‌లను సులభంగా పంచుకోవడానికి మీకు తోడ్పడుతుంది. అయితే 2019లోనే గూగుల్ ఈ సేవలను నలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కానీ సేవలను ఎప్పుడు నిలిపివేస్తామన్న విషయాన్ని చెప్పలేదు.

అయితే తాజాగా గూగుల్ తన URL షార్ట్నర్ (goo.gl) సేవను నిలిపివేయడానికి ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించింది. ఆగస్టు 25 తర్వాత వినియోగదారులు ఈ సేవను ఉపయోగించలేరని కంపెనీ స్పష్టం చేసింది. ఆగస్ట్ 25 తర్వాత ఏ goo.gl లింక్ పనిచేయదని తెలిపింది. ఒక వేళ మీరు దాన్ని సెర్చ్ చేసిన 404 ఎర్రర్‌ను అని మీకు చూయిస్తుందని గూగుల్‌ పేర్కొంది.

గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ URL షార్ట్‌నర్‌కు సెర్చింగ్‌ ట్రాఫిక్‌ తగ్గిందని గూగుల్ చెప్పుకొచ్చింది. జూన్ 2024లో, 99 శాతం లింక్‌లలో ఎటువంటి కార్యాచరణ నమోదు కాలేదని కంపెనీ తెలిపింది. అప్పటి నుండి ఫైర్‌బేస్ డైనమిక్ లింక్స్ (FDL) గూగుల్ URL షార్ట్‌నర్‌ను భర్తీ చేసింది.

కొన్ని సేవలకు మాత్రం మినహాయింపు

అయితే, కొన్ని సేవలకు మినహాయింపు ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. లొకేషన్ షేరింగ్ కోసం ‘మ్యాప్స్’ వంటి గూగుల్ యాప్‌ల ద్వారా సృష్టించబడిన goo.gl లింక్‌లు ఆగస్టు 25 గడువు తర్వాత కూడా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.