Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meta AI: ఏఐ ద్వారా ఫ్రీగా వీడియో ఎడిటింగ్.. మెటాతో సాధ్యమే..!

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఈ ఫోన్స్ వాట్సాప్, ఫేస్ బుక్ వంటి యాప్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ యాప్స్ అన్నీ మెటా ద్వారా నడుస్తున్నాయి. తాజాగా మెటా ఏఐ సాయంతో వీడియో ఎడిటింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ఫీచర్ సక్సెస్ అయితే త్వరలో ఆయా యాప్స్‌లో యూజర్లు వీడియో ఎడిటింగ్‌ను చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో మెటా ఏఐ వీడియో ఎడిటింగ్ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Meta AI: ఏఐ ద్వారా ఫ్రీగా వీడియో ఎడిటింగ్.. మెటాతో సాధ్యమే..!
Meta Ai
Srinu
|

Updated on: Jun 15, 2025 | 4:38 PM

Share

మెటా ఏఐ తాజాగా తన ఫీచర్ల శ్రేణిని అప్‌డేట్ చేస్తుంది. వినియోగదారుల కోసం మొట్టమొదటి వీడియో ఎడిటింగ్ ఎంపికను తీసుకువస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగదారులు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో వాడేలా మెటా ఏఐ వీడియో ఎడిటింగ్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. మెటా ఏఐ ఎంపిక చేసిన ప్రాంతాలకు ఈ కొత్త టూల్‌ను అందిస్తోంది. కానీ క్రమంగా ఎక్కువ మంది వినియోగదారులు దాని ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మెటా ఏఐ వెబ్‌సైట్‌లో, ఇటీవల ప్రవేశపెట్టిన ఎడిట్స్ యాప్‌లో వీడియో ఎడిటింగ్ టూల్ అందుబాటులో ఉందని మెటా తెలిపింది. వీడియో ఎడిటింగ్ కోసం కంపెనీ ఏఐ ప్రాంప్ట్‌ల ప్రీసెట్‌ను అభివృద్ధి చేసింది

ఈ ఏఐ ప్రాంప్ట్‌ల ద్వారా మీరు ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో షేర్ చేయడానికి అనువుగా దుస్తులు, స్థానం లేదా లైటింగ్‌ను కూడా మార్చడానికి ఉపయోగించవచ్చు. వీడియోలను సవరించడానికి ప్రజలు వారి సొంత టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ఈ ఫీచర్ ఏఐ మోడల్ సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీచర్ ఈ సంవత్సరం చివర్లో అందుబాటులోకి వస్తుంది. 

ఏఐ వీడియో ఎడిటింగ్ టూల్ పని చేసేది ఇలా

  • మీరు మెటా ఏఐ యాప్, వెబ్‌సైట్ లేదా ఎడిట్స్ యాప్‌లో వీడియోను అప్‌లోడ్ చేయాలి.
  • వీడియోలోని 10 సెకన్లను ఉచితంగా ఎడిట్ ముందుగా అమర్చిన 50 ప్రాంప్ట్‌లలో దేనినైనా ఉపయోగించాలి
  • మెటా ఏఐ వీడియోను గ్రాఫిక్ లేదా కామిక్ పుస్తక దృష్టాంతంగా ఎడిట్ చేస్తుంది.
  • మీ వీడియోను వీడియో గేమ్‌గా మార్చడానికి మీరు ఏఐను కూడా పొందవచ్చు.

ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత అనేది ఉంటుంది. కాబట్టి మెటా ఏఐ మీ ఆలోచనలకు అనుగుణంగా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మెచ్చేలా వీడియో ఎడిట్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆసక్తికరమైన వీడియోలను తయారు చేయడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను రూపొందించామని మెటా తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఏఐ ఎడిటింగ్ టూల్ ఉచితంగా 10 సెకన్లకు పరిమితం చేశారు. ఈ వారం యాప్, వెబ్‌సైట్‌కు జోడించిన వీడియో ఫీచర్‌ను యూఎస్‌లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hydra: సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే...
Hydra: సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే...
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం వేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం వేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీసుకు పిలిచి లక్ష రూపాయలు
పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీసుకు పిలిచి లక్ష రూపాయలు
Andhrapradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌...
Andhrapradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌...
యువకులకు భలే ఛాన్స్.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు ప్రకటన
యువకులకు భలే ఛాన్స్.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు ప్రకటన
TS Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
TS Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
'4ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే..'
'4ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే..'
తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ఎంత?
తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ఎంత?
Horoscope Today: మెరుగ్గా ఆ రాశివారి ఆర్థిక పరిస్థితి..
Horoscope Today: మెరుగ్గా ఆ రాశివారి ఆర్థిక పరిస్థితి..
సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి
సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి