AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Power: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను మూత్రంతో ఛార్జ్ చేయవచ్చు.. ఇది ఎలాగో తెలిస్తే షాకవుతారు..

మీ శరీరంలోని వ్యర్థాలను అంటే మూత్రాన్ని విద్యుత్‌గా మార్చే అంశంపై బ్రిటన్‌లో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రిటన్‌లోని శాస్త్రవేత్తల బృందం ఈ పనిని సుసాధ్యం చేయడానికి నిరంతరం ప్రయోగాలు చేస్తున్నాయి.

Smart Power: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను మూత్రంతో ఛార్జ్ చేయవచ్చు.. ఇది ఎలాగో తెలిస్తే షాకవుతారు..
Smartphone Charging
Sanjay Kasula
|

Updated on: Feb 19, 2023 | 12:52 PM

Share

మనం రోజుకు ఎన్నిసార్లు బాత్రూమ్‌కి వెళ్తుంటామో గుర్తుందా..? మీ శరీరం నుంచి బయటకు వచ్చే వ్యర్థాలు అంటే మూత్రం కూడా కొంత ఉపయోగపడుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?  దీనికి మనలో చాలా మంది వద్ద జవాబు ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు ఆ వసరం రాలేదు. అయితే, ఇదే అంశంపై కొందరు పరిశోధకులకు ఈ ఆలోచన తట్టింది. ఇలాంటి ఎన్నింటినో తమకు పరిశోధన అంశాలుగా మార్చుకుంటున్నారు సైంటిస్టులు. అందుకే,  సాంకేతికత లేదా సైన్స్ చాలా దూరం పోయింది. ఎంతలా అంటే మనం మూత్రం విసర్జించిన టాయిలెట్ రూమ్‌లోని టాయిలెట్ బిన్‌ నుంచి విద్యుత్తును తయారు చేసేవరకు.. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో మొబైల్స్ లేదా ల్యాప్‌టాప్స్ ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చట. ఒక్క రోజుకు సరిపడే విద్యుత్‌ను ఇలా ఉత్పత్తి చేయవచ్చట. ఈ విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. దీనికి సమాధానం ఇక్కడ తెలుసుకుందాం.

మూత్రాన్ని విద్యుత్తుగా మార్చడం..

బ్రిటన్‌లో మీ శరీరంలోని వ్యర్థాలను అంటే మూత్రాన్ని విద్యుత్‌గా మార్చే పని చాలా జరుగుతోంది. బ్రిటన్‌లోని శాస్త్రవేత్తల బృందం ఈ పనిని సుసాధ్యం చేయడానికి నిరంతరం ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, చాలా మంది శాస్త్రవేత్తలు ఈ పనిలో చాలా వరకు విజయం సాధించారు. శాస్త్రవేత్తల ప్రకారం, శరీర వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తే, భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే మానవ విసర్జన తరగని వనరు.

మూత్ర విద్యుత్తుతో మొబైల్ ఛార్జ్?

మీడియా కథనాల ప్రకారం, ఇప్పటివరకు శాస్త్రవేత్తలు మూత్రం ద్వారా చాలా విద్యుత్తును ఉత్పత్తి చేశారంటే చిన్న మొబైల్‌ను ఛార్జ్ చేయవచ్చు. వాస్తవానికి, ‘మైక్రోబయల్ ఫ్యూయల్ సెల్’ విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రక్రియను పూర్తి చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఎనర్జీ కన్వర్టర్. దీని కోసం, మూత్రంలో కొన్ని బ్యాక్టీరియా కూడా కలుపుతారు. బ్రిస్టల్ రోబోటిక్స్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు కూడా మూత్రంతో తయారు చేసిన విద్యుత్తును ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సాంకేతికత విజయవంతమైతే, బాత్రూమ్‌లలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇది షవర్లు, లైటింగ్, రేజర్లు, స్మార్ట్‌హోమ్‌లను ఛార్జ్ చేయడానికి తగినంత విద్యుత్తును సులభంగా ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్..