Year Ender 2021: ఈ ఏడాదిలో ట్విట్టర్ తీసుకువచ్చిన టాప్-9 ఫీచర్స్ ఇవే..!
Year Ender 2021: ట్విట్టర్ ఈ ఏడాదిలో ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ట్విట్టర్ అద్భుతమైన ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేసింది. మరి ఈ 2021 ఏడాదిలో ఎలాంటి ఫీచర్స్, అప్‌డేట్స్ తీసుకువచ్చిందో ఓ సారి చూద్దాం...
Updated on: Dec 25, 2021 | 7:09 AM

బర్డ్ వాచ్ (Birdwatch): యూజర్లను తప్పుదారి పట్టించే ట్వీట్స్‌లకు ఈ బర్డ్ వాచ్ ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. పైలట్‌లో ఉన్న వ్యక్తులు తప్పుదారి పట్టించే ట్వీట్‌లను కలిగి ఉన్నారని ఈ ఫీచర్ ద్వారా తెలిసిపోతుంది. అంతేకాకుండా ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్న పైలట్ వ్యక్తులు మాత్రమే తప్పుడు సమాచారాన్ని గుర్తిస్తుంది.

వాయిస్ నోట్స్ (Voice Notes): ట్విట్టర్‌లో యూజర్లకు ఇష్టమైన వాయిస్‌లకు సపోర్టు చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ఈ ఫీచర్ వల్ల వినియోగదారులు 140 సెకన్ల సందేశాన్ని రికార్డు చేసి ట్విట్‌గా పంపడానికి సపోర్టు చేస్తుంది. దీనిని ఫిబ్రవరి 2021లో ప్రారంభించింది.

4k ఫోటోల అప్‌లోడ్ ఫీచర్: (4K Image Uploads): ట్వీట్టర్‌లో ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో 4K ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి దీనిని రూపొందించింది ట్విట్టర్. వెబ్ వెర్షన్ ఇప్పటికే అధిక రిజల్యూషన్ 4096x4096 ఫోటోల అప్‌లోడ్‌కు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ట్విట్టర్ యాప్ మొబైల్ వెర్షెన్‌లో అప్‌లోడ్ కోసం గరిష్టంగా 2048x2048 సైజు వరకు పరిమితి ఉంటుంది.

ట్విట్టర్ స్పేసెస్ (Twitter Spaces): ఈ ఫీచర్ క్లబ్ హౌస్ లాంటి ఆడియో చాట్ సేవలను స్వీకరిస్తుంది. స్పేస్ సేషన్ యొక్క రికార్డింగ్‌ను వినేందుకు వీలు కల్పించేందుకు ఉపయోగపడుతుంది. ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌పై చర్చల రికార్డింగ్‌ను వినడానికి, వినియోగదారులకు పాడ్‌కాస్ట్ లాంటి ఫీచర్లను పొందుపరుస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది ట్విట్టర్.

సూఫర్ ఫాలోస్ (Super Follows): సూపర్ ఫాలోస్ ఫీచర్ పేమెంట్ చేసే సబ్స్క్రైబర్ల కోసం ఉపయోగపడనుంది. ట్వీట్లను షేర్ చేయడం ద్వారా క్రియేటర్ల ద్వారా నెలవారీ ఆదాయాన్ని పొందేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.

ట్విట్టర్ బ్లూ (Twitter Blue): ట్విట్టర్ బ్లూ అనేది ఓ సబ్స్క్రిప్షన్ సర్వీస్. ఈ ఫీచర్ ట్విట్లను రద్దు చేసే సామర్థ్యం ఉంటుంది. అమెరికాలో నెలకు 2.99 డార్లు (222) ధరతో ప్రకటనలు లేకుండా వార్త కథనాలు చదవడం, లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేయడం, ట్విట్టర్ యాప్‌లో నేవిగేషన్ బార్‌ను కస్టమైజ్ చేయడం లాంటి సదుపాయాలు ఈ ఫీచర్ ద్వారా పొందవచ్చు. ఇక భారతలో నెలకు రూ.269 ఖర్చు అవుతుంది.

టిక్కెటెడ్ స్పేసెస్ (Ticketed Spaces): ఈ ఫీచర్‌లో ప్రత్యక్ష ఆడియో సెషన్‌లను హోస్టు చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. క్రియెటర్లు ఓ నిర్దిష్ట మార్కును చేరుకునే వరకు ఈ టిక్కెట్ స్పేసెస్ నుంచి సంపాదించిన ఆదాయంలో 97 శాతం వరకు అందుకుంటారు.

తప్పుడు సమాచారం లేబుల్స్ ఫీచర్ (Combating Misinformation): తప్పుడు సమాచారంపై లేబుల్ అప్‌డేట్ ఉపయోగపడనుంది. ట్వీట్ ఎందుకు తప్పుదారి పట్టించవచ్చునో తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ట్విట్టర్ ఈ కొత్త ఫీచర్‌ను డిజైన్ ప్రారంభించింది.

సేఫ్టీ మోడ్ ఫీచర్ (Safety Mode): ఈ సేఫ్టీ మోడ్ ఫీచర్‌ను ట్వీట్‌ల రిసీవింగ్ ఎండ్‌లో ప్రమాదకరమైన వ్యాఖ్యాలను, కామెంట్లను తగ్గించేందుకు దీనిని రూపొందించారు. విద్వేషపూరితమైన వ్యాఖ్యలు, దుర్భాషలను పంపే అకౌంట్లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసేస్తుంది. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్ భాషలో ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో ట్విట్టర్ టెస్టింగ్ దశలో ఉంచింది.





























