Xiaomi: సరికొత్త ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసిన షియోమీ… చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Xiaomi Introduces New Technology: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ వినియోగదారులకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయనుంది. సాధారణంగా ఇప్పటి వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ వ్యవస్థ అందుబాటులో ఉన్నా..

Xiaomi: సరికొత్త ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసిన షియోమీ... చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Follow us

|

Updated on: Jan 29, 2021 | 9:19 PM

Xiaomi Introduces New Technology: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ వినియోగదారులకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయనుంది. సాధారణంగా ఇప్పటి వరకు వైర్‌లెస్ ఛార్జింగ్ వ్యవస్థ అందుబాటులో ఉన్నా.. ఒక ప్యానల్ లాంటి వస్తువుపై పెడితేనే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. అలా కాకుండా ఎలాంటి కనెక్షన్ లేకుండా గాల్లోనే ఛార్జింగ్ అవుతే… ఏంటి ఊహించుకోవడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ మీరు చదివింది నిజమే. మరికొన్ని రోజుల్లో ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో పెను మార్పులకు శ్రీకారం చుడుతూ షియోమీ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ కొత్త విధానాన్ని స్పేస్ పొజిషనింగ్, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసినట్లు షియోమీ సీఈఓ తెలిపారు. దీనిలోని 144 యాంటెన్నాలతో కూడిన ఫేస్ కంట్రోల్ అర్రే మిల్లీమీటర్ తరంగాలు నేరుగా బీమ్‌ఫార్మింగ్ ద్వారా ఛార్జింగ్ అవసరమయ్యే స్మార్ట్‌ఫోన్‌కు వెళతాయి. ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ బేస్ మోడల్ ద్వారా 5వాట్స్‌కి సపోర్ట్ చేసే ఒకటి కంటే ఎక్కువ పరికరాలను ఒకేసారి ఛార్జింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ షియోమీ విడుదల చేసిన వీడియో చివరిలో… ‘ఇది సైన్స్ ఫిక్షన్ కాదు.. టెక్నాలజీ అద్భుతం’ అని పేర్కొంది.

Also Read: Ocean cleanup yacht: ఈ యాచ్ సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను పైకి తోడుతుంది.. అదే వ్యర్థాలను ఇంధనంగా మారుస్తుంది