Xiaomi MI 11 Lite: భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన షియోమీ కొత్త ఫోన్.. ఎమ్ఐ 11 లైట్ ఫోన్‌పై లుక్కేయండి..
Xiaomi MI 11 Lite: ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్ ఫోన్‌లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచుకుంది చైనాకు చెందిన షియోమీ కంపెనీ. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్ఐ 11 పేరుతో భారత మార్కెట్లోకి...

Xiaomi MI 11 Lite: ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్ ఫోన్‌లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచుకుంది చైనాకు చెందిన షియోమీ కంపెనీ. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్ఐ 11 పేరుతో భారత మార్కెట్లోకి సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేశారు. జూన్ 25 నుంచి షియోమీ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇతర ఆన్‌లైన్ సైట్‌లలో ప్రీ ఆర్డర్ అందుబాటులోకి రానుంది. ఇక మొదటి సేల్ జూన్ 28 నుంచి ప్రారంభంకానుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో విడుదలైన ఈ ఫోన్ ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి..
ధరలు..
* 6జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధరను రూ.20,499గా నిర్ణయించారు. * 8జీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 22,499 * ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 డిస్కౌంట్ పొందొచ్చు.
ఫీచర్లు..
* 6.8 మి.మి మందంతో ఈ ఫోన్‌ను చాలా స్లిమ్‌గా రూపొందించారు. బరువు 157 గ్రాములు ఉంది. * 10 బిట్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. 90హెడ్జ్ రిఫ్రేష్ రేట్ అందించారు. * క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్. * 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. * 4,250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 33వాట్స్ ఫాస్ట్ చార్జింగ్.
Samsung M32: భారత మార్కెట్‌లోకి శాంసంగ్ గెలాక్సీ ఎం32.. ధర, ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
