AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లటి కవర్లలో రహస్యంగా ఢిల్లీకి.. షీ జిన్‌పింగ్ ‘సీక్రెట్’ కారు ఎన్​701 ఇదే.. వివరాలివే

Xi Jinping Presidential Car Hongqi N701.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విదేశీ పర్యటనకు వస్తే ఆయనతో పాటు మరో ప్రత్యేక అతిథి కూడా వస్తుంది. అదే ఆయన అధికారిక కారు. తాజాగా ఢిల్లీలో నల్లటి కవర్లతో చుట్టిన వాహనాలు కనిపించడంతో అందరి దృష్టి వాటిపై పడింది. వాటిలో షీ జిన్‌పింగ్ ఉపయోగించే Hongqi N701 కూడా ఉన్నట్లు సమాచారం. అసలు ఈ కారు ప్రత్యేకత ఏమిటో తెలుసా?

నల్లటి కవర్లలో రహస్యంగా ఢిల్లీకి.. షీ జిన్‌పింగ్ ‘సీక్రెట్’ కారు ఎన్​701 ఇదే.. వివరాలివే
Xi Jinping Presidential Car Hongqi N701
Nikhil
|

Updated on: Sep 15, 2026 | 6:30 AM

Share

దేశాధినేతల వాహనాలకు సాధారణ కార్లతో పోలిస్తే భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో వాటిని ముందుగానే ఆతిథ్య దేశానికి తరలించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఢిల్లీలో నల్లటి కవర్లతో కనిపించిన వాహనాలు ఆసక్తిని పెంచాయి. వాటిలో చైనా అధ్యక్షుడి ప్రత్యేక Hongqi N701 ఉందనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

నల్లటి కవర్ల వెనుక అసలు కారణం ఇదే!

విదేశీ పర్యటనల్లో దేశాధినేతల అధికారిక వాహనాలను ముందుగానే తరలించడం సాధారణమే. కార్గో విమానాలు, ప్రత్యేక క్యారియర్లు ఇతర రవాణా మార్గాల ద్వారా వీటిని తీసుకొస్తారు. దుమ్ము, వర్షం, ఎండ నుంచి రక్షించడంతో పాటు రవాణా సమయంలో చిన్నపాటి నష్టాలు జరగకుండా కవర్లు ఉపయోగిస్తారు. అయితే అత్యంత భద్రత కలిగిన ప్రభుత్వ వాహనాల విషయంలో మరో ముఖ్య కారణం కూడా ఉంటుంది. కారు డిజైన్, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు వంటి వివరాలు ముందుగానే బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఢిల్లీలో కనిపించిన వాహనాల విషయంలో ఇదే కారణం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.

5.5 మీటర్ల భారీ కారు.. భద్రతే ప్రధాన బలం!

Hongqi N701 చైనా లగ్జరీ కార్ల సంస్థ Hongqi రూపొందించిన ప్రత్యేక లిమోసిన్. ‘Hongqi’ అంటే చైనీస్‌లో ‘ఎర్ర జెండా’ అని అర్థం. ఈ సంస్థకు చైనా రాజకీయ నాయకత్వంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. N701 సాధారణ వినియోగదారులకు విక్రయించే మోడల్ కాదు. చైనా అగ్ర నాయకత్వం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కారు పూర్తి వివరాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం N701 పొడవు సుమారు 5.5 మీటర్లు. భారీ గ్రిల్, ప్రత్యేక Hongqi చిహ్నాలతో దీని రూపం గంభీరంగా ఉంటుంది. బుల్లెట్లను తట్టుకునే గ్లాస్, బలమైన బాడీ, ప్రత్యేక టైర్లు వంటి రక్షణ వ్యవస్థలు ఇందులో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పేలుళ్లు, రసాయన దాడుల నుంచి రక్షణ కల్పించే సదుపాయాలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

అయితే వీటిలో చాలా అంశాలను Hongqi అధికారికంగా ధృవీకరించలేదు. 6.0 లీటర్ V12 ఇంజన్, సుమారు 408 హార్స్‌పవర్ శక్తి వంటి వివరాలు కూడా పలు నివేదికల్లో ఉన్నాయి. కారు అసలు స్పెసిఫికేషన్లు మాత్రం పూర్తిగా రహస్యంగానే ఉన్నాయి. రష్యా, అమెరికా, ఈజిప్ట్, హాంకాంగ్ వంటి ప్రాంతాల్లో షీ జిన్‌పింగ్ విదేశీ పర్యటనల సమయంలో N701 కనిపించింది. విదేశీ లగ్జరీ కార్లకు బదులుగా చైనాలో తయారైన ప్రత్యేక వాహనాన్ని అధ్యక్షుడు ఉపయోగించడం ఈ కారు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇది చైనా ఆటోమొబైల్ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచేలా రూపొందించిన వాహనంగా భావిస్తున్నారు.

Follow Us