AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Humanoid Robot: ప్రపంచంలోనే అత్యంత అధునాతన హ్యూమనాయిడ్ రోబో.. దీని పేరు ఏంటో తెలుసా..

ప్రపంచంలోనే అత్యంత అధునాతన హ్యూమనాయిడ్ రోబోను UKలో ప్రవేశపెట్టారు. దీనికి 'ఈమెకా' అని పేరు పెట్టారు. దీనిని బ్రిటిష్ కంపెనీ ఇంజినీర్డ్ ఆర్ట్స్ తయారు చేసింది.

Humanoid Robot: ప్రపంచంలోనే అత్యంత అధునాతన హ్యూమనాయిడ్ రోబో.. దీని పేరు ఏంటో తెలుసా..
Worlds Most Advanced Humano
Sanjay Kasula
|

Updated on: Dec 05, 2021 | 5:55 PM

Share

Next Humanoid Robot: ప్రపంచంలోనే అత్యంత అధునాతన హ్యూమనాయిడ్ రోబోను UKలో ప్రవేశపెట్టారు. దీనికి ‘ఈమెకా’ అని పేరు పెట్టారు. దీనిని బ్రిటిష్ కంపెనీ ఇంజినీర్డ్ ఆర్ట్స్ తయారు చేసింది. ఈ రోబోలో అత్యంత విశేషమేమిటంటే, దీని ముఖకవళికలు మనుషుల్లాగే ఉంటాయి. ఈ రోబోను సిద్ధం చేయడానికి ఎంత ఖర్చయిందనే దానిపై కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు. ఈ హ్యూమనాయిడ్ రోబో అనేక విధాలుగా మనుషులను పోలి ఉంటుందని, అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన హ్యూమనాయిడ్ రోబోగా పేరు పొందిందని కంపెనీ పేర్కొంది. కంపెనీ తన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేయడం ద్వారా ఎబెకాను పరిచయం చేసింది. యూట్యూబ్ యూజర్లు, ఇది చాలా వాస్తవమైనది.. మనుషులలా కనిపించే గొప్ప యంత్రం అని అంటున్నారు.

మనిషిలా కనిపించే కృత్రిమ శరీరంతో ఈమెకాను తయారు చేసినట్లు దీన్ని తయారు చేసిన ఇంజినీర్డ్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది. ఇందులో సోఫియా రోబోలో ఉపయోగించిన టెక్నాలజీని చాలా వరకు ఉపయోగించారు. సోఫియా రోబోట్ 2016 లో ప్రవేశపెట్టబడింది, దీనిని సూపర్ ఇంటెలిజెంట్ రోబోట్ అని కూడా పిలుస్తారు.

యూట్యూబ్‌లో విడుదలైన అరేకా వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. ఒక యూజర్ ఇలా వ్రాశారు.. దీనికి మనిషిని పోలిన  పెద్ద  కళ్ళు ఉన్నాయని అన్నారు. అంతేకాదు ఇది ఇతర రోబోట్‌లకు భిన్నంగా ఉంటుందన్నారు. దాని కళ్లలో కదలిక కనిపిస్తుంది.. అది రెప్ప వేస్తుంది. దీని కళ్ళు ప్రతి ఒక్కరిని ఆకర్షించగలదు. మరొక నెటిజన్ ఇలా రాశారు.. దాని చేతులు చాలా మెరుగ్గా చేయబడ్డాయి.

భవిష్యత్తులో మానవ-రోబోటిక్స్ టెక్నాలజీకి ఎమెకా ఒక ఉదాహరణ అని కంపెనీ చెబుతోంది. భవిష్యత్తులో మేము దానిని మెరుగుపరచడానికి అప్‌గ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఇంజినీర్డ్ ఆర్ట్స్ కంపెనీ 2005లో ప్రారంభమైంది. ఇంతకుముందే కంపెనీ రోబోలను సిద్ధం చేసింది, ఇది సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి: Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. 10 రోజుల్లోనే ‘రైతుబంధు

Snoring Tips: గుడ్ న్యూస్.. గురకను మాయం చేసే అద్భుతమైన నివారణ చిట్కా..