- Telugu News Photo Gallery Technology photos Instagram introduced new feature. with this user can restrict his comments
Instagram: మీకు నచ్చని వారు చేసే కామెంట్లు, అందరికీ కనిపించకుండా చేయొచ్చు.. ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్..
Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మనం చేసే పోస్టులకు యూజర్లు చేసే కామెంట్లను ఇతరులకు కనిపించకుండా రిస్ట్రిక్ట్ చేసే అవకాశం కల్పించారు...
Updated on: Dec 05, 2021 | 1:47 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఏదైనా పోస్ట్ చేస్తే రకరకాల కామెంట్లు చేస్తుంటారు. అందులో మనకు నచ్చని కామెంట్లు చేస్తుంటారు కొందరు. అయితే ఆ కామెంట్లను ఇతరులు కూడా చూసే అవకాశం ఉంటుంది.

అలా కాకుండా మీరు ఎంచుకున్న వ్యక్తి కామెంట్లు కేవలం మీకే కనపడేట్లు ఉంటూ ఇతరులెవరికీ కనిపించకపోతే భలే ఉంటుంది. కదూ.. ఇలాంటి ఫీచర్‌నే తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్. ఈ ఫీచర్‌తో వ్యక్తిని పూర్తిగా బ్లాక్ చేయకుండా కామెంట్లు ఇతరులకు కనిపించకుండా చేసుకోవచ్చు.

ఇందుకోసం మూడు విధానాలు అందుబాటులో ఉన్నాయి.. అందులో ఒకటి, ఎవరి కామెంట్స్ కనిపించకూడదనుకుంటున్నారో వారి ప్రొఫైల్‌కు వెళ్లాలి. అనంతరం ఇన్‌స్టాగ్రామ్ పాప్ అప్ చూపిస్తుంది. అక్కడ రిస్ట్రిక్ట్ అకౌంట్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

రెండో విధానం ద్వారా మీరు ఎవరినైతే రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారో వారి డైరెక్ట్ మెసేజ్ విభాగంలోకి వెళ్లాలి. అనంతరం సదరు వ్యక్తి చాట్‌ను ఓపెన్ చేసి.. షేర్డ్ మీడియా, చాట్ సెట్టింగ్‌లోకి వెళ్లి రిస్ట్రిక్ట్ బటన్ క్లిక్ చేయాలి.

మూడో విధానంలో.. ముందుగా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత కనెక్షన్స్ కింద రిస్ట్రిక్ట్ అకౌంట్స్ క్లిక్ చేయాలి. తర్వాత ఎవరినైతే రిస్ట్రిక్ట్చేయాలనుకుంటున్నారో సెర్చ్ చేసి వారి పేరు పక్కన రిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తే చాలు.





























