New Smartphone: ఇది ఫోన్‌ కాదు అంతకుమించి.. ఏకంగా 24జీబీ ర్యామ్‌తో సెన్సేషన్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే..

నుబియా నుంచి వస్తున్న ఈ రెడ్‌ మ్యాజిక్‌ 8ఎస్‌ ప్రో 24జీబీ స్మార్ట్‌ ఫోన్‌ జూలై 5న చైనాలో విడుదల కానుంది. ఇటీవల కాలంలో ఎక్కువ ర్యామ్‌ సైజ్‌ చూపిస్తున్న ఫోన్లలో దానిని వర్చువల్‌ గా చూపిస్తున్నాయి. అయితే ఈ ఫోన్‌ అలా కాదని కంపెనీ నిర్ధారిస్తోంది.

New Smartphone: ఇది ఫోన్‌ కాదు అంతకుమించి.. ఏకంగా 24జీబీ ర్యామ్‌తో సెన్సేషన్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే..
Nubia Redmagic 8s

Updated on: Jul 03, 2023 | 7:30 AM

శాస్త్ర సాంకేతికత వేగంగా మారిపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లు వస్తున్నాయి. ఆండ్రాయిడ్లు రాకమునుపు వరకూ 512ఎంబీ ఉండే ర్యామ్‌లే మనకు తెలుసు. ఆండ్రాయిడ్లు రంగ ప్రవేశం చేశాక.. 1జీబీ, 2జీబీ ర్యామ్‌ సైజ్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్లు ఎక్కువకాలం నడిచాయి. ఆ తర్వాత 4జీబీ, 6జీబీ ఇప్పుడు 8జీబీ, 12 జీబీ వరకూ కూడా ర్యామ్‌ సైజ్‌ ఉన్న ఫోన్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల ఎక్కువగా గేమింగ్‌ కోసం యువత ఫోన్లనే వినియోగిస్తుండటంతో అధిక ర్యామ్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్ల అవసరం ఏర్పడుతోంది. ఎందుకంటే పబ్జీ లాంటి గేమ్‌లు ఏకంగా 1 జీబీ నుంచి 2జీబీ వరకూ ర్యామ్‌ సైజ్‌ ను తీసేసుకుంటాయి. ఈ నేపథ్యంలో అధిక ర్యామ్‌ సైజ్‌ ఉన్న ఫోన్లకు డిమాండ్‌ ఏర్పడుతోంది. అయితే ఇప్పటి వరకూ మనకు 12 జీబీ వరకూ ర్యామ్‌ లు ఉన్న ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 18జీబీ ఉన్న ఫోన్లు కూడా ఉ‍న్నాయి గానీ చాలా అరుదు. అయితే ఇప్పుడు ఏకంగా 24జీబీతో ఓ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు రెడీ అయ్యింది. నుబియా కంపెనీ నుంచి ఈ కొత్త స్మార్ట్ ఫోన్‌ వస్తోంది. నుబియా రెడ్‌ మ్యాజిక్‌ 8ఎస్‌ ప్రో పేరుతో ప్రపంచంలో మొట్టమొదటి 24జీబీ ర్యామ్‌ కలిగిన ఫోన్‌ గా ఇది రికార్డు సృష్టించనుంది.

నుబియా రెడ్‌ మ్యాజిక్‌ 8ఎస్‌ ప్రో లాంచింగ్‌ ఎప్పుడంటే..

నుబియా నుంచి వస్తున్న ఈ రెడ్‌ మ్యాజిక్‌ 8ఎస్‌ ప్రో 24జీబీ స్మార్ట్‌ ఫోన్‌ జూలై 5న చైనాలో విడుదల కానుంది. ఇటీవల కాలంలో ఎక్కువ ర్యామ్‌ సైజ్‌ చూపిస్తున్న ఫోన్లలో దానిని వర్చువల్‌ గా చూపిస్తోంది. అయితే ఈ ఫోన్‌ అలా కాదని కంపెనీ నిర్ధారిస్తోంది. ఒకటే ఫోన్లో 24జీబీ ర్యామ్‌ ఉంటుందని కంపెనీ పేర్కొంది.

నుబియా రెడ్‌ మ్యాజిక్‌ 8ఎస్‌ ప్రో స్పెసిఫికేషన్లు..

నుబియా రెడ్‌ మ్యాజిక్‌ 8ఎస్‌ ప్రో హ్యాండ్‌సెట్ లో 3.36GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 లీడింగ్ వెర్షన్‌ను కలిగి ఉంది. దీని ప్రామాణిక గత మోడల్‌ లో ఇది 3.19GHzగా ఉంది.ఈ ఫోన్లు ‍ప్రధానంగా గేమర్లను లక్ష్యంగా చేసుకొని కంపెనీ దీనిని తీసుకొస్తోంది. దీనిలో 24జీబీ ర్యామ్‌ ఉంటుంది కాబట్టి మల్టీ టాస్కింగ్ కు బాగా ఉపకరిస్తుంది.

ఇవి కూడా చదవండి

త్వరలో ఆ కంపెనీల నుంచి కూడా..

నుబియా రెడ్‌ మ్యాజిక్‌ 8ఎస్‌ ప్రోతో పాటు, రియల్‌మీ, వన్‌ ప్లస్‌ కూడా 24జీబీ ర్యామ్‌ సైజ్‌ ఉన్న ఫోన్‌లను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనిలో వన్‌ ప్లస్‌ ఏస్‌ 2 ప్రో వచ్చే నెలలో లాంచ్‌ అ‍య్యే అవకాశం ఉంది. రియల్‌ మీ నుంచి 24జీబీ ర్యామ్‌ ఫోన్‌ ఎప్పుడొస్తుందో పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

ఆరోజే లాంచింగ్‌..

జూలై 5న జరిగే ఈవెంట్‌లో నుబియా రెడ్‌ మ్యాజిక్‌ 8ఎస్‌ ప్రో స్మార్ట్‌ ఫోన్‌తో పాటు కొత్త గేమింగ్ టాబ్లెట్‌ను కూడా పరిచయం చేయనుంది. స్పెసిఫికేషన్‌లు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన రెడ్‌మ్యాజిక్ 8 ప్రో మాదిరిగానే ఉంటాయి. దీనిలో 6.8-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ ప్లే, 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్, 6000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, 80వాట్ల సామర్థ్యంతో ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్టు ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..