Airplane Facts: విమానం గాలి నుండి రన్‌వే (Runway)పైకి వచ్చినప్పుడు వాటి టైర్లు వేగంగా నేలపై పడటం మీరు తప్పక చూసి ఉంటారు. నేలపై పడిన తర్వాత విమానం వేగాన్ని, అంత పెద్ద విమానం (Flight) ఒత్తిడిని తట్టుకుని సులువుగా ముందుకు సాగుతాయి. కానీ ఈ విమానం టైర్లు (Aircraft Tyres) ఎందుకు పేలవని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అయితే ఈ టైర్లు ఎంత బలంగా ఉంటాయో తెలుసుకోండి. విమానం టైర్లు వేల పౌండ్ల బరువు, అధిక వేగాన్ని తట్టుకోగలవు. అవి ప్రత్యేకంగా తయారు చేయడమే ఇందుకు కారణం. ఈ టైర్లను దృఢంగా తయారు చేయబడుతుంది. అందులో నైట్రోజన్ వాయువు (Nitrogen) నింపబడుతుంది. దీని కారణంగా ల్యాండింగ్ సమయంలో కఠినమైన పరిస్థితుల్లో కూడా దీని కలయిక ప్రభావవంతంగా ఉంటుంది.
టైర్ల తయారీలో అల్యూమినియం, స్టీల్, నైలాన్:
ఈ టైర్లు సింథటిక్ రబ్బరు సమ్మేళనాల కలయికతో తయారు చేయబడతాయి. ఇందులో అల్యూమినియం స్టీల్, నైలాన్‌ను కలుపుతారు. ఇవి టైర్లను బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడతాయి. విమానం ల్యాండింగ్ సమయంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఇవి పగిలిపోవు. ఎలాంటి సమస్య రాదు.
విమానం టైర్లు ట్రక్ టైర్ల కంటే రెండింతలు పెంచి ఉంటాయి. కార్ టైర్ల కంటే ఆరు రెట్లు ఎక్కువ గాలి ఉంటుంది. ఈ విమాన టైర్లను తయారు చేస్తున్నప్పుడు వాటి పరిమాణం, విమానం ఆధారంగా దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు.
విమానం టైర్లలో ప్రత్యేకమైన గాలి:
ఇంకో విషయం ఏంటంటే ఈ టైర్లలో ఓ ప్రత్యేకమైన గాలిని నింపుతారు. దీనిని నైట్రోజన్ వాయువు అంటారు. విమానం టైర్లు నైట్రోజన్‌తో నింపబడి ఉంటాయి. నత్రజని జడ వాయువు కాబట్టి అధిక ఉష్ణోగ్రత, పీడన మార్పుల ప్రభావం వాటిపై తక్కువగా ఉంటుంది. టైర్లను తయారు చేసిన తర్వాత 38 టన్నుల వరకు బరువుతో పరీక్షిస్తారు. పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపిన తర్వాతే విమానాలకు బిగిస్తారు.
ఇవి కూడా చదవండి: