AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airplane Mode:‌ విమాన ప్రయాణంలో ఫోన్‌ని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టమని ఎందుకు అంటారో తెలుసా..

విమాన ప్రయాణ సమయంలో మీ స్మార్ట్ ఫోన్‌ను  స్విచ్ ఆఫ్ లేదా ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం మంచిది అని మీకు విమాన సిబ్బంది సూచిస్తారు. అలా ఎందుకు అనౌన్స్ చేస్తారో ఎప్పుడైనా మీరు ఆలోచించారా.

Airplane Mode:‌ విమాన ప్రయాణంలో ఫోన్‌ని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టమని ఎందుకు అంటారో తెలుసా..
Airplane Mode
Sanjay Kasula
|

Updated on: Jan 09, 2022 | 4:58 PM

Share

విమాన ప్రయాణ సమయంలో మీ స్మార్ట్ ఫోన్‌ను  స్విచ్ ఆఫ్ లేదా ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం మంచిది అని మీకు విమాన సిబ్బంది సూచిస్తారు. అలా ఎందుకు అనౌన్స్ చేస్తారో ఎప్పుడైనా మీరు ఆలోచించారా. దీనికి కారణం ఏంటో తెలుసుకోండి..  మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇవ్వబడిన ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ లేదా ‘ఫ్లై మోడ్’ ఫీచర్ గురించి మీరు తప్పక విని ఉంటారు. చాలా మంది మొబైల్ యూజర్లు తమకు వచ్చే కాల్స్‌ కాల్‌ నుంచి తప్పించుకునేందుకు ఈ ఆప్షన్ ను ఉపయోగిస్తారు. కానీ నిజమైన అర్థంలో ఇది విమాన ప్రయాణంలో ఉపయోగించేందుకు రూపొందించబడింది. విమాన ప్రయాణ సమయంలో పరికరాన్ని స్విచ్ ఆఫ్ చేయడం లేదా ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం మంచిది. అలా ఎందుకు చెప్పారో ఎప్పుడైనా ఆలోచించారా.. దీనికి కారణం తెలుసుకోండి.

సాధారణంగా మొబైల్ టవర్ మధ్య సిగ్నల్ ప్రసారం ఉంటుంది. విమాన ప్రయాణంలో కూడా ఈ రేడియో సిగ్నల్స్ కొనసాగుతాయి. అందువల్ల, ప్రయాణీకులు విమాన ప్రయాణానికి ముందు ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచడం మంచిది. ఇలా చేసిన తర్వాత సిగ్నల్ ప్రసారం ఆగిపోతుంది.

బ్రిటానికా వెబ్‌సైట్ ప్రకారం.. చాలా ఎయిర్‌లైన్స్ ఈ రేడియో సిగ్నల్‌ల ఉనికి విమానంలోని పరికరాలు, సెన్సార్లు, నావిగేషన్ , అనేక ఇతర ముఖ్యమైన సిస్టమ్‌లను ప్రభావితం చేస్తుందని నమ్ముతున్నాయి, కాబట్టి ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచడం మంచిది. ఇది ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆధునిక విమానంలో ఉపయోగించే సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలను రేడియో ఫ్రీక్వెన్సీ ప్రభావితం చేయలేని విధంగా రూపొందించినప్పటికీ, ఇది ముందుజాగ్రత్తగా జరుగుతుంది. బ్రిటానికా నివేదిక ప్రకారం, 2000లో స్విట్జర్లాండ్ , 2003లో న్యూజిలాండ్‌లో జరిగిన విమాన ప్రమాదాలకు మొబైల్ ఫోన్ ప్రసారమే కారణమని భావిస్తున్నారు.

దీనికి సంబంధించి చైనాలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. చైనాలోని సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విమాన ప్రయాణానికి సంబంధించి కఠినమైన నిబంధనలను విధించింది. ఇక్కడ, ఫ్లైట్ సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఆఫ్ చేయడంలో వైఫల్యం జరిమానా లేదా జైలు శిక్ష కూడా విధించబడుతుంది.

ఇవి కూడా చదవండి:  Technology News: గుడ్‌న్యూస్.. మీ WhatsApp ద్వారా UPI పిన్‌ రీసెట్ చేయవచ్చు.. ప్రాసెస్ ఎలానో తెలుసుకోండి..

Viral Video: ఈ బుజ్జి కోతి చేసిన పని చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు.. నెట్టింట్లో తెగ వైరల్..