Water Bottle Caps: వాటర్ బాటిల్ మూతల రంగు వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏంటి?

రైలు లేదా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మనం తరచుగా వాటర్ బాటిల్ కొంటుంటాం. ఈ బాటిల్స్‌లో చాలా వరకు బ్లూ కలర్ క్యాప్‌లు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని తెలుసా? బ్లూ కలర్ క్యాప్..

Water Bottle Caps: వాటర్ బాటిల్ మూతల రంగు వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏంటి?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 23, 2024 | 3:52 PM

మనం పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్లినా లేదా నడక కోసం బయటకు వెళ్లినా వాటర్‌ బాటిల్‌ ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. నీరు లేకుండా కొన్ని గంటలు గడపడం కూడా కష్టంగా మారింది. నీరు ఎంత తాగితే అంత మంచిదని నిపుణులు కూడా సూచిస్తుంటారు. చాలా మంది బయట వాటర్‌ బాటిళ్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రతి వాటర్ బాటిళ్ల మూతలు వేర్వేలు రంగుల్లో ఉంటాయి. ఇలా ఎందుకు ఎంటాయోనని మీరెప్పుడైనా గమనించారా? రంగులకు అర్థం ఏమిటో తెలుసా? అసలైన, ఈ రంగులు సీసాలో ఎలాంటి నీరు నింపుతారో తెలియజేస్తుంది. ఈ రంగుల ద్వారా మీరు నీటి రకాన్ని ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం..

మూత నీలం రంగు ఏమి చెబుతుంది?

రైలు లేదా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మనం తరచుగా వాటర్ బాటిల్ కొంటుంటాం. ఈ బాటిల్స్‌లో చాలా వరకు బ్లూ కలర్ క్యాప్‌లు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని తెలుసా? బ్లూ కలర్ క్యాప్ ఉంటే ఆ నీరు మినరల్ వాటర్ అని అర్ధం. 2023లో ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నీలిరంగు క్యాప్‌తో ఉన్న నీటిలో సాధారణ నీటి కంటే 20% ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జియాంగ్‌సీ యూనివర్సిటీ ఆఫ్ ట్రాడిషనల్ చైనీజ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డాక్టర్ జియాంగ్ యున్ పాల్గొన్నారు.

తెలుపు రంగు మూత:

వాటర్ బాటిల్ క్యాప్స్ రంగులు వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. తెల్లటి రంగు మూత ఈ నీరు సాధారణ తాగునీరు అని చెబుతుంది.

ఆకుపచ్చ మూత:

ఆకుపచ్చ రంగు రుచిగల నీటిని సూచిస్తుంది. ఇది కాకుండా, కొన్ని బ్రాండ్‌లు తమ బ్రాండ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మూత రంగులను ఎంచుకుంటాయి. అయితే ప్రతి బాటిల్‌పై నీటి గురించిన పూర్తి సమాచారం రాసి ఉండటంతో గందరగోళం అవసరం లేదు.

ఎరుపు మూత:

ఎరుపు మూత మెరిసే ఉంటే కార్బోనేటేడ్ నీటిని సూచిస్తుంది.

పసుపు మూత

పసుపు మూత విటమిన్లు, ఎలక్ట్రోలైట్లలో సమృద్ధిగా ఉన్న నీటిని సూచిస్తుంది.

నలుపు రంగు మూత:

నలుపు రంగు తరచుగా ప్రీమియం లేదా ఆల్కలీన్ వాటర్ బాటిళ్లలో కనిపిస్తుంది. ఈ బ్లాక్‌ కలర్‌ క్యాప్‌ ఉండే వాటర్‌ బాటిల్స్‌ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ కలర్ క్యాప్స్​ని కేవలం ప్రీమియం వాటర్ ఉత్పత్తులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇలాంటి నీటిని ఎక్కువగా సెలబ్రిటీలు తాగుతుంటారు.

పింక్‌ మూత:

పింక్ కలర్‌ క్యాప్‌తో ఉండే వాటర్‌ బాటిల్స్‌ విషయానికొస్తే.. ఇది వాటర్ గురించి చెప్పేది కాదని.. పలు స్వచ్ఛంద సంస్థలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి క్యాప్స్‌ను ఉపయోగిస్తాయని చెబుతుంటారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి