AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాయ్ కొత్త రూల్స్… DTH సర్వీసుల్లో ఏ ఆపరేటర్ బెస్ట్?

వీడియోకాన్, రిలయన్స్ డిజిటల్, టాటా స్కై, డీ2హెచ్, ఎయిర్‌టెల్, సన్ డైరెక్ట్.. ఇలా వివిధ రకాల డీటీహెచ్ సంస్థలు దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిల్లో ఏ డీటీహెచ్ ప్రొవైడర్ ద్వారా నాణ్యమైన సేవలు పొందవచ్చో ఎక్కువ మందికి తెలియదు. ఇటీవలే ట్రాయ్ కొత్త నిబంధనలు కూడా తీసుకువచ్చింది. దీంతో డీటీహెచ్ సేవలపై సబ్‌స్క్రైబర్లు సందిగ్ధంలోకి వెళ్లిపోయారు. కొత్త నిబంధనల నేపథ్యంలో ఏ డీటీహెచ్ ప్రొవైడర్ ఉత్తమమైన సేవలు ఎలా అందిస్తున్నాయో చూద్దాం.. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ భారతీ […]

ట్రాయ్ కొత్త రూల్స్... DTH సర్వీసుల్లో ఏ ఆపరేటర్ బెస్ట్?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 30, 2019 | 5:04 PM

Share

వీడియోకాన్, రిలయన్స్ డిజిటల్, టాటా స్కై, డీ2హెచ్, ఎయిర్‌టెల్, సన్ డైరెక్ట్.. ఇలా వివిధ రకాల డీటీహెచ్ సంస్థలు దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిల్లో ఏ డీటీహెచ్ ప్రొవైడర్ ద్వారా నాణ్యమైన సేవలు పొందవచ్చో ఎక్కువ మందికి తెలియదు. ఇటీవలే ట్రాయ్ కొత్త నిబంధనలు కూడా తీసుకువచ్చింది. దీంతో డీటీహెచ్ సేవలపై సబ్‌స్క్రైబర్లు సందిగ్ధంలోకి వెళ్లిపోయారు. కొత్త నిబంధనల నేపథ్యంలో ఏ డీటీహెచ్ ప్రొవైడర్ ఉత్తమమైన సేవలు ఎలా అందిస్తున్నాయో చూద్దాం..

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన డీటీహెచ్ విభాగమే ఈ సంస్థ. దేశంలో ఈ సంస్థకు 1.5 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ట్రాయ్ కొత్త నిబంధనల తర్వాత ఈ సంస్థ చాలా ప్యాక్స్ ఆవిష్కరించింది. చాలా రీజనల్ ప్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

టాటా స్కై దేశంలోని అదిపెద్ద డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ టాటా స్కై. ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకువచ్చిన తర్వాత ఈ సంస్థ కొత్త ఛానల్ ప్యాక్స్‌ లిస్టింగ్, వీటి ధర నిర్ణయం వంటి వాటిల్లో ఆలస్యంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అయితే సబ్‌స్క్రైబర్లు కొత్త విధానంలోకి మారడానికి ఈ సంస్థ చాలానే కష్టపడింది. కొత్త విధానం తర్వాత టాటా స్కై చాలా హెచ్‌డీ, ఎస్‌డీ ప్యాక్స్‌ను ఆవిష్కరించింది. ప్రాంతీయ భాషల్లోనూ చాలా ప్యాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. మిని ప్యాక్స్‌ కూడా ఆవిష్కరించింది. దాదాపు 65 ఎక్స్‌క్లూజివ్ ఛానళ్లను అందిస్తోంది. అలాగే ఈ సంస్థ ఇటీవలే పెయిడ్ ఛానల్స్‌పై లాకిన్ పీరియడ్ కూడా తీసేసింది.

డీ2హెచ్ ట్రాయ్ కొత్త నిబంధనలకు తొలిగా స్పందించిన సంస్థ ఇదే. ఇతర కంపెనీల కన్నా ముందే మైగ్రేషన్ (కస్టమర్లు కొత్త విధానంలోకి మారడం) ప్రక్రియను ప్రారంభించింది. ఈ కంపెనీ చాలా కాంబో ప్లాన్స్‌ను ఆవిష్కరించింది. అలాగే యాడ్ ఆన్ ప్యాక్స్ తీసుకువచ్చింది. ప్రాంతీయ భాషల్లో చాలా ప్యాక్స్‌ను ఆవిష్కరించింది. అలాగే సబ్‌స్క్రైబర్లు అదనపు కనెక్షన్ తీసుకోవాలంటే కేవలం రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.

సన్ డైరెక్ట్ దక్షిణ భారతదేశంలో ప్రధానమైన డీటీహెచ్ ఆపరేటర్ సన్ డైరెక్ట్. అయితే ఈ కంపెనీ ఉత్తర భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించలేకపోతోంది. ప్రత్యర్థుల మాదిరిగానే ఈ సంస్థ కొత్త ఛానల్ ప్యాక్స్‌ను, రీజనల్ ఛానళ్లను, యాడ్ ఆన్ ప్యాక్స్‌ను లాంచ్ చేసింది. దీర్ఘకాలానికి వైవిధ్య భరితమైన ఛానళ్లను అందించే సంస్థ ఇదొక్కటే అని చెప్పొచ్చు.