హమ్మయ్య.. ఎట్టకేలకు భూమిపైకి రానున్న సునీతా విలియమ్స్! డేట్ ఫిక్స్
ప్రత్యేకమైన మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగామి సునీతా విలయమ్స్ ఎట్టకేలకు తిరిగి భూమిపైకి రానున్నారు. దీనికి సంబంధించి డేట్ ను కూడా స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్ మోరె కూడా తిరిగి భూమిపైకి రానున్నారు.

దాదాపు 8 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరిగి భూమికి చేరుకోనున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా.. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోరోలను స్పేస్‌లోకి పంపిన విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సల్‌లో ఐఎస్‌ఎస్‌కి చేరుకున్న విలియమ్స్, విలోమోరె మిషన్ ముగించుకొని.. తిరిగి వచ్చే క్రమంలో వారి బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే ఉండిపోయారు.
వారిని ఎలాగైన తిరిగి భూమి పైకి తిరిగి తీసుకొని రావాలని నాసా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. విలియమ్స్, విల్‌మోరెలను భూమీపైకి వీలైనంత త్వరగా తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే ది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మార్చ్ 12న బయలుదేరి.. మార్చ్ 19న ఇద్దరు వ్యోమగాములతో తిరిగి భూమికి చేరుకోనుంది. దీంతో దాదాపు 8 నెలల సుదీర్ఘ కాలం పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న విలియమ్స్, విల్‌మోరె భూమికి రానున్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి