RBI: బాంకులపై సైబర్ దాడులకు ఇక చెక్.. ఆర్బీఐ కీలక నిర్ణయం
RBI: బ్యాంకింగ్ రంగంలో సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతూనే ఉంది. ఇప్పుడు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ పెరిగేకొద్ది రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థికపరమైన మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఇది అందుబాటులోకి రానుంది..

ఆర్థిక సేవల కోసం డిజిటలైజేషన్ మరింత వేగవంతమైంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టెక్నాలజీని మరింత అభివృద్ధి అవుతోంది. అయితే టెక్నాలజీ పెరిగే కొద్ది సైబర్ మోసాలు కూడా అంతే జరుగుతున్నాయి. ఎంతో మంది డిజిటల్ మోసాలకు గురవుతున్నారు. అయితే ఈ బ్యాంకింగ్ రంగంలో సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతూనే ఉంది. ఇప్పుడు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేకమైన “.bank.in” డొమైన్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ భద్రతను మెరుగుపరచడం, ఫిషింగ్ దాడులను తగ్గించడం, డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపు వ్యవస్థలను మరింత బలోపేతం చేయనుంది.
ఆర్థిక మోసాలను అరికట్టడానికి భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేక ‘.bank.in’ ఇంటర్నెట్ డొమైన్‌ను ప్రారంభించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల ప్రకటించారు. భారతీయ బ్యాంకుల కోసం రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ Bank.inను అమలు చేయబోతోంది. ఈ విధానం ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చట్టబద్ధమైన బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లు, మోసపూరిత వెబ్‌సైట్‌ల మధ్య తేడాను గుర్తించడంలో కస్టమర్‌లకు సహాయపడటం ఈ విధానం లక్ష్యం.
bank.in డొమైన్ అంటే ఏమిటి?
ఆర్బీఐ బ్యాంక్ ‘bank.in’ ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్‌ను అమలు చేస్తుంది. ఈ డొమైన్ పేరు నమోదు ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. ఇది బ్యాంకింగ్ మోసాలను నివారించడంలో సహాయపడుతుంది. దీని తరువాత ఆర్థిక రంగానికి ‘ఈ కొత్త డొమైన్‌ను స్వీకరించనున్నారని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.
బ్యాంకింగ్ మోసాలను నిరోధించడానికి ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఈ డొమైన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. తదనంతరం, ఆర్థిక రంగానికి ‘fin.in’ డొమైన్ ప్రారంభించనున్నామని గవర్నర్ తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




