WhatsApp New Feature: ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు! కొత్త షార్ట్ కట్స్ ఏమిటో తెలుసా? పూర్తి వివరాలు..

| Edited By: Ram Naramaneni

Oct 19, 2023 | 10:17 PM

కొత్త అథంటికేషన్ విధానం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. చాట్ లాకింగ్ చేసేందుకు కొత్త షార్ట్ కట్స్ ప్రవేశ పెడుతున్నట్లు చెబుతున్నారు. అలాగే అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ పాత వెర్షన్ ఓఎస్ ఉన్న ఫోన్లలో పనిచేయదని వాట్సాప్ ప్రకటించింది. లేటెస్ట్ ఫీచర్లు.. లేటెస్ట్ ఓఎస్ పైనే వర్క్ అవుతాయని పేర్కొంది. ఈ అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

WhatsApp New Feature: ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు! కొత్త షార్ట్ కట్స్ ఏమిటో తెలుసా? పూర్తి వివరాలు..
Whatsapp New Feature
Follow us on

వాట్సాప్ జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ మెసేజింగ్ యాప్ లేని సమాజాన్ని ఊహించలేం. అంతటి ఆదరణ పొందిన ఈ యాప్ దానిని కొనసాగించడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. వినియోగదారులకు ఏది అవసరమైన దానిపై ఎప్పటికప్పుడు ఫీడ్ తీసుకుంటూ కొత్త ఫీచర్లతో అప్ డేట్లు తీసుకొస్తుంది. ఇదే క్రమంలో మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్ ను ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆన్ లైన్లో ఈ మేరకు ఓ రిపోర్టు చక్కర్లు కొడుతోంది. కొత్త అథంటికేషన్ విధానం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. చాట్ లాకింగ్ చేసేందుకు కొత్త షార్ట్ కట్స్ ప్రవేశ పెడుతున్నట్లు చెబుతున్నారు. అలాగే అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ పాత వెర్షన్ ఓఎస్ ఉన్న ఫోన్లలో పనిచేయదని వాట్సాప్ ప్రకటించింది. లేటెస్ట్ ఫీచర్లు.. లేటెస్ట్ ఓఎస్ పైనే వర్క్ అవుతాయని పేర్కొంది. ఈ అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వాబీటీ ఇన్ ఫో ప్రకారం.. వాట్సాప్ చాట్ల కోసం కొత్త షార్ట్ కట్స్ ను ఆవిష్కరిస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే కొన్ని ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. 2.23.22.4 వెర్షన్ యాప్ లో ఈ ఫీచర్ ఉన్నట్లు సమాచారం.

ఈకొత్త షార్ట్ కట్స్ తో మీకు కావాల్సిన చాట్ ను లాక్ చేయొచ్చు. ఆ లాక్ అయిన చాట్ చాట్ లిస్ట్ చివరికి చేరి ఉంటుంది. అంతేకాక చాట్ ఇన్ ఫో స్క్రీన్ లో ఆ లాక్ చేసిన చాట్ లాక్ అయ్యే కనిపిస్తుంది. తద్వారా మీ చాట్ ను మీరు తప్ప మరెవరూ చూడలేరు. అలాగే మీ చాట్ ను చాట్‌ను త్వరగా లాక్ చేయవలసి వచ్చినప్పుడు ఈ షార్ట్‌కట్‌లు బాగా సహాయపడతాయి. యాప్ మునుపటి అప్‌డేట్‌లలో, వినియోగదారులు చాట్ సమాచార విభాగాన్ని తెరిచి, చాట్‌ను లాక్ చేయడానికి ఎంపికను ఎంచుకుని, “చాట్ లాక్” స్క్రీన్‌లో టోగుల్‌ను ప్రారంభించాలి. అయితే కొత్త అప్ డేట్లో ఇది మరింత సౌకర్యవంతంగా మారింది. అంతేకాక చాట్ ఇన్ ఫో స్క్రీన్ లో కూడా లాక్ అయ్యే ఉండటం దీనిలోని కొత్త అంశం. అంతేకాక ఈ షార్ట్ కట్స్ తో లాకింగ్, అన్ లాకింగ్ సౌకర్యవంతంగామారడంతో పాటు సులభతరం కూడా అయ్యిందని వాబీటా ఇన్ ఫో రిపోర్టు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 24 నుంచి కొత్త సాఫ్ట్ వేర్..

అక్టోబర్ 24 నుంచి కొత్త సాఫ్ట్ వేర్ ను వాట్సాప్ తీసుకురానుంది. దాదాపు 14 పాత కాలపు స్మార్ట్ ఫోన్లలో ఇక వాట్సాప్ నిలిచిపోనుంది. ఈ మేరకు వాట్సాప్ కీలక ప్రకటన చేసింది. వచ్చే వారం ప్రారంభం నుంచి కొన్ని అవుట్ డేటెడ్ ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజెస్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. సమకూరుతున్న అత్యాధునిక సాంకేతికతను అందింపుచ్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. కొత్త సాఫ్ట్ వేర్లు అప్ గ్రేడెడ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్లకు సపోర్టు చేస్తున్నాయి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లలో ఓఎస్ లు అప్ డేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీ స్మార్ట్ ఫోన్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచిస్తోంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఉంటే.. తమ లేటెస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని చెబుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..