Google Digikavach: సైబర్ దాడుల నుంచి కాపాడే ‘కవచ్’.. గూగుల్ నుంచి సరికొత్త రక్షణ వ్యవస్థ
ఎంతలా సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటున్నా.. సైబరాసురులు ఏదో ఒక విధంగా దాడికి తెగబడుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను ఆవిష్కరించింది. ఇది ప్రతి ఒక్కరి ఖాతాకు ఒక సంరక్షణ కవచంలా ఉంటుందని గూగుల్ చెబుతోంది. ఈ కొత్త సాఫ్ట్ వేర్ పేరు గూగుల్ డిజికవచ్. ఈ డిజికవచ్ ఎలా పనిచేస్తుంది? ఇది సైబరాసురుల నుంచి ఎలా సంరక్షిస్తుంది?

సైబర్ దాడులు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతున్నా.. అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కూడా అప్ డేట్ అవుతున్నారు. ఈ క్రమంలో వ్యక్తుల భద్రత కష్టసాధ్యమవుతోంది. వారి అకౌంట్లు ప్రశ్నార్థకమవుతోంది. ఎంతలా సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటున్నా.. సైబరాసురులు ఏదో ఒక విధంగా దాడికి తెగబడుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను ఆవిష్కరించింది. ఇది ప్రతి ఒక్కరి ఖాతాకు ఒక సంరక్షణ కవచంలా ఉంటుందని గూగుల్ చెబుతోంది. ఈ కొత్త సాఫ్ట్ వేర్ పేరు గూగుల్ డిజికవచ్. ఈ డిజికవచ్ ఎలా పనిచేస్తుంది? ఇది సైబరాసురుల నుంచి ఎలా సంరక్షిస్తుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
డిజికవచ్ ప్రోగ్రామ్ లక్ష్యం..
స్కామర్‌ల పనితీరుని అధ్యయనం చేయడం.. ఆర్థిక మోసాలను ఎదుర్కోవడంలో మొదటి దశ స్కామర్‌లు ఉపయోగించే వ్యూహాలను అర్థం చేసుకోవడం. డిజికవచ్ ను నిర్వహించే బృందాలు మోసగాళ్లు ఉపయోగించే క్లిష్టమైన వెబ్‌లను కనుగొనేందుకు శ్రమిస్తుంటారు.
థ్రెట్లను పసిగట్టడం.. గతంలో చేసిన మోసం నమూనాలపై లోతైన అవగాహనతో పాటు వచ్చే థ్రెట్లను డిజికవచ్ పసిగడుతుంది. అందుకోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంది. తద్వారా వ్యక్తులు, సంస్థలకు ఆర్థిక నష్టాలను నివారించేందుకు కృషి చేస్తుంది. విస్తృత ఎకో సిస్టమ్ కలిసి పనిచేస్తుంది.. ఆర్థిక మోసం జరగకుడా చేసేందుకు సమిష్టి కృషి అవసరమని డిజి కవచ్ గుర్తించింది. దీనిలో భాగంగా వివిధ సంస్థలు, అధికారుల సహకారం తీసుకుంటుంది ఏయే సంస్థలతో కలిసి పనిచేస్తుందంటే..
- ఫిన్‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ (FACE): గతంలో జరిగిన మోసం నమూనాలను అధ్యయనం చేయడంతో పాటు మెరుగైన భద్రతను అందించేందుకు డిజికవచ్ దీనికి అనుసంధానమై పనిచేస్తుంది. దోపిడీ రుణ యాప్‌లకు వ్యతిరేకంగా వేగంగా చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటుంది.
- సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930): హోం అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ) ద్వారా స్థాపించబడిన ఈ హెల్ప్‌లైన్, డిజికవాచ్‌కి కీలక మిత్రుడు. ఈ రెండూ కలిసి ఆర్థిక మోసానికి గురైన వ్యక్తులకు సకాలంలో సమాచారం, మద్దతు అందిస్తారు.
- గూగుల్‌తో సురక్షితం.. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఈ మిషన్‌లో భాగస్వామి. వారు భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఉత్పత్తులను నిర్మించడం ద్వారా డిజికవచ్‌కు సహకరిస్తారు. తద్వారా డిజిటల్ లావాదేవీల మొత్తం భద్రతను మెరుగుపరుస్తారు.
గూగుల్ సహకారం ఇలా..
మీ ఆర్థిక వ్యవహారాల వ్యవస్థను గూగుల్ ఏవిధంగా సంరక్షిస్తుంతో తెలుసుకుందాం..
జీమెయిల్ ఫిషింగ్ ప్రొటెక్షన్.. ప్రస్తుతం అనేక ఆర్థిక మోసాల ప్రయత్నాలు మోసపూరిత ఈ-మెయిల్‌ల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ కు చెందిన ఈ-మెయిల్ సేవ అయిన జీమెయిల్, స్పామ్, ఫిషింగ్, మాల్వేర్‌లలో 99.9 శాతానికి పైగా స్వయంచాలకంగా జీమెయిల్ బ్లాక్ చేస్తుంది. ఈ స్థాయి రక్షణ ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్లకు పైగా ఇన్‌బాక్స్‌లను సురక్షితం చేస్తుంది వ్యక్తులు ఫిషింగ్ స్కామ్‌లకు గురయ్యే అవకాశం తక్కువగా ఉందని నిర్ధారిస్తుంది.
గూగుల్ ప్లే ప్రొటెక్ట్.. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం, గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనేది ఇన్ బిల్ట్ రక్షణ వ్యవస్థ. ఆండ్రాయిడ్ పరికరాలు, డేటా, యాప్‌లను సురక్షితంగా ఉంచడానికి ఈ సేవ బ్యాక్ గ్రౌండ్లో నిరంతరం పని చేస్తుంది. ప్రతిరోజూ, ఇది మాల్వేర్ కోసం 125 బిలియన్ ఇన్‌స్టాల్ చేయబడిన ఆండ్రాయిడ్ యాప్‌లను స్కాన్ చేస్తుంది. ఇది మోసపూరిత యాప్‌లను డౌన్‌లోడ్ చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గూగుల్ పే భద్రతా హెచ్చరికలు.. వినియోగదారులు డబ్బు పంపినప్పుడు, స్వీకరించినప్పుడు ఫిషింగ్, ఇతర మోసాలను గుర్తించడానికి గూగుల్ పేలో మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. ప్రతిరోజూ, గూగుల్ పే వందల వేల మంది వినియోగదారులకు భద్రతా హెచ్చరికలను పంపుతుంది, అనుమానాస్పద లావాదేవీల నుంచి వారిని సమర్థవంతంగా రక్షిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..