Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇకపై మీ చాటింగ్స్‌ మరింత భద్రం..

ఇదిలా ఉంటే ఇక ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారుతోన్న నేటి టెక్‌ యుగంలో వాట్సాప్‌ యూజర్ల భద్రతకు భరోసానిస్తోంది. పలు రకాల ప్రైవసీ ఫీచర్స్‌ను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్‌.. ఇటీవల చాట్‌లాక్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సహాయంతో ఇతరులు ఎవరైనా మన వాట్సాప్‌ చాట్‌ ఓపెన్ చేస్తే సంబంధిత మెసేజ్‌లు చూడకుండా చేసుకోవచ్చు...

Whatsapp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇకపై మీ చాటింగ్స్‌ మరింత భద్రం..
Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 10, 2023 | 3:56 PM

టెక్‌ మార్కెట్లోకి ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుండడమే. యూజర్ల అవసరాలకు అనుగుణంగా, భద్రతకు పెద్ద పీట వేస్తూ వస్తోంది కాబట్టే వాట్సాప్‌కు యూజర్లు పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే ఏకైక మెసేజింగ్‌ యాప్‌గా వాట్సాప్‌ నిలవడానికి దీని ఫీచర్స్ కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదిలా ఉంటే ఇక ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారుతోన్న నేటి టెక్‌ యుగంలో వాట్సాప్‌ యూజర్ల భద్రతకు భరోసానిస్తోంది. పలు రకాల ప్రైవసీ ఫీచర్స్‌ను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే వ్యక్తిగత ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్‌.. ఇటీవల చాట్‌లాక్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సహాయంతో ఇతరులు ఎవరైనా మన వాట్సాప్‌ చాట్‌ ఓపెన్ చేస్తే సంబంధిత మెసేజ్‌లు చూడకుండా చేసుకోవచ్చు. చాట్‌ ఓపెన్‌ కావాలంటే పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసేలా ఆప్షన్‌ను అందించారు. దీంతో మీ చాట్‌ను ఎవరు పడితే వారు చూడలేరు.

అయితే తాజాగా ఈ ఫీచర్‌కు కొనసాగింపుగా వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ‘సీక్రెట్ కోడ్‌’ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. చాట్ లాక్‌ ఫీచర్‌లో కోడ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీక్రెట్ కోడ్‌ ఫీచర్‌లో ఆ పాస్‌వర్డ్ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది .అయితే ‘సీక్రెట్ కోడ్‌’ ఫీచర్‌ ద్వారా మీరు ఎంచుకున్న చాట్‌ ఎవరికీ కనిపించకుండా చేసుకోవచ్చు. సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే మీ చాట్ కనిపించేలా చేసుకోవచ్చు.

మీరు కోరుకున్న చాట్‌ను సీక్రెట్‌ కోడ్‌ ద్వారా లాక్‌ చేసకోవచ్చు. ఒకవేళ చాట్‌ను అన్‌లాక్ చేసుకోవాలంటే.. వాట్సాప్‌ సెర్చ్‌ బార్‌లో సదరు సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సీక్రెట్‌ కోడ్‌ను యూజర్‌ తన ఇష్టానికి అనుగుణంగా సెలక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్‌ సెర్చ్‌ బాక్స్‌లో సదరు సీక్రెట్ కోడ్‌ను ఎంటర్‌ చేయగానే చాట్‌ లాక్‌లో ఉన్న చాట్‌లన్నీ ఓపెన్ అవుతాయి. ప్రస్తుతం బీటా వెర్షన్‌ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్‌ త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..