Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy SmartTag 2: ట్యాగ్ చేయండి.. ట్రాక్ చేయండి.. సూపర్ ఫీచర్లతో గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్2.. మీ పెంపుడు జంతువులకూ అమర్చొచ్చు..

. కేవలం వస్తువులు మాత్రమే కాదండోయ్.. మీరు పెంచుకునే పెంపుడు జంతువులుకూడా ఎక్కడున్నాయో,ఏం చేస్తున్నాయో తెలుసుకోవడం ఇక చాలా ఈజీ. దీని కోసం శామ్సంగ్ కొత్త డివైజ్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. శామ్సంగ్ గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్2 పేరిట దీనిని ఆవిష్కరించింది. అక్టోబర్ 11 నుంచి అందుబాటులోకి తేనుంది. మీ విలువైన వస్తువులను ట్రాక్ చేయడానికి ఇది ఉపకరిస్తుంది.

Samsung Galaxy SmartTag 2: ట్యాగ్ చేయండి.. ట్రాక్ చేయండి.. సూపర్ ఫీచర్లతో గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్2.. మీ పెంపుడు జంతువులకూ అమర్చొచ్చు..
Samsung Galaxy Smart Tag 2
Follow us
Madhu

| Edited By: TV9 Telugu

Updated on: Oct 11, 2023 | 3:40 PM

ఇకపై మీ వస్తువులు పోయినా ఇట్టే దొరికేస్తాయి. కేవలం వస్తువులు మాత్రమే కాదండోయ్.. మీరు పెంచుకునే పెంపుడు జంతువులుకూడా ఎక్కడున్నాయో,ఏం చేస్తున్నాయో తెలుసుకోవడం ఇక చాలా ఈజీ. దీని కోసం శామ్సంగ్ కొత్త డివైజ్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. శామ్సంగ్ గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్2 పేరిట దీనిని ఆవిష్కరించింది. అక్టోబర్ 11 నుంచి అందుబాటులోకి తేనుంది. మీ విలువైన వస్తువులను ట్రాక్ చేయడానికి ఇది ఉపకరిస్తుంది. గతంలో అందుబాటులో ఉన్న డివైజ్ కంటే కూడా ఇది మెరుగ్గా ఉండేలా దీనిని డిజైన్ చేశారు. పలు ఫీచర్లను అప్ గ్రేడ్ చేశారు. ఈ శామ్సంగ్ గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్ 2 కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

శామ్సంగ్ గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్ 2..

శామ్సంగ్ గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్ 2లో కొత్త ఫీచర్లు యాడ్ చేశారు. దీనిలోని లాస్ట్ మోడ్ మెసేజ్ ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు ఉపకరిస్తుంది. పరికరానికి అమర్చిన గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్2 ను స్కాన్ చేయడం ద్వారా ఆ డివైజ్ యజమాని వివరాలు తెలుస్తాయి. ఎవరైనా ట్యాగ్‌ని స్కాన్ చేస్తే.. ఆ వస్తువు యజమాని చెప్పే మెసేజ్ తో పాటు అతని కాంటాక్ట్ ఇన్ ఫర్మేషన్ కనిపిస్తాయి.దీనిని పెంపుడు జంతువు కాలర్‌కు కూడా పెట్టొచ్చు. తద్వారా ఆ పెట్ తప్పిపోయినా.. లేక ఎటైనా వెళ్లిపోయానా కూడా యజమాని ఫోన్ నంబర్ ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఇబ్బందులు తప్పుతాయి. అలాగే దీనిలో మెరుగైన కాంపాస్ వ్యూ ఫీచర్ ను కూడా జోడించారు. దీని సాయంతో మీరు ట్యాగ్ పెట్టిన వస్తువు ఎక్కడ ఉందో తెలుస్తుంది. దాని వద్దకు వెళ్లేందుకు దారి కూడా మ్యాప్ లో బాణాలు చూపిస్తూ నడిపిస్తుంది. ఈ మోడ్ యూడబ్ల్యూ సపోర్టు ఉన్న గేలాక్సీ ఎస్23 అల్ట్రా వంటి గేలాక్సీ ఫోన్లలో పనిచేస్తుంది.

యాప్ అప్ డేట్..

స్మార్ట్ థింగ్స్ ఫైండ్ యాప్ కూడా అప్‌గ్రేడ్ అయ్యింది. కొత్తగా రిజిస్టర్ అయిన గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్స్ ఇప్పుడు వినియోగదారు స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌కి షార్ట్‌కట్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. ఇది వినియోగదారులు స్మార్ట్ థింగ్స్ ఫైండ్ యాప్ ను మరింత త్వరగా ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుంది. అదనంగా, యాప్ ఇప్పుడు పూర్తి స్క్రీన్ మ్యాప్ వీక్షణతో పాటు స్పష్టమైన ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది, ఇది వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగు పరుస్తోంది.

ఇవి కూడా చదవండి

700 రోజుల బ్యాటరీ జీవితం..

పవర్ సేవింగ్ మోడ్‌తో, గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్ 2 బ్యాటరీ ఇప్పుడు 700 రోజుల వరకు ఉంటుంది, ఇది మునుపటి గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్ మోడల్‌ల కంటే రెండు రెట్లు ఎక్కువ. సాధారణ మోడ్‌లో కూడా, బ్యాటరీ జీవితకాలం ఇప్పుడు 500 రోజులకు పెంచారు. ఇది మునుపటి మోడల్‌లలో కంటే 50% పెరిగింది.

గేలాక్సీ స్మార్ట్ ట్యాగ్ 2 కొత్త కాంపాక్ట్ సైజు, రింగ్-ఆకారపు డిజైన్ సులభంగా ఉపయోగించేందుకు వీలు కల్పిస్తుంది. పెద్ద మెటల్ లూప్ క్లిప్‌లు, కీరింగ్‌ల వంటి యాక్సెసరీలకు దీనిని అమర్చుకోవచ్చు. ఈ బ్యాగ్‌లు, సామానుకు జోడించవచ్చు. ఐపీ67 రేటింగ్ తో నీరు, ధూళి నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది పెట్ వాకింగ్ మోడ్‌కు కూడా మద్దతు ఇస్తుంది, వినియోగదారులు తమ పెట్ లతో జాగింగ్ లేదా వాకింగ్ వెళ్లేందుకు ఇది బాగా ఉపకరిస్తుంది. ఇది బ్లూటూత్ లో ఎనర్జీ (బీఎల్ఈ) యూడబ్ల్యూబీ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటుంది. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ఫైండ్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులకు వారి స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఉపయోగించి పోయిన వస్తువు వైపు దృష్టి సారించడానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఇది గరిష్టంగా 120 మీటర్ల బ్లూటూత్ పరిధిలో పని చేస్తుంది. స్మార్ట్ థింగ్స్ యాప్ సాయంతో స్మార్ట్ గృహోపకరణాలను కూడా నియంత్రించవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..