వాట్సాప్‌‌లో మరో కొత్త ఫీచర్.. ఏంటంటే..!

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది ఈ సంస్థ. ఇదివరకు వాట్సాప్‌లో మనం వీడియో లేదా మెసేజ్‌ను పంపేముందు ఒకసారి పరిశీలించుకునే అవకాశం ఉండేది. అయితే ఆడియో సందేశాలకు మాత్రం ఈ అవకాశం ఉండేది కాదు. మనం రికార్డు చేసినవి పంపితే.. అవి తిరిగి మనం వినే లోపు అవతల వ్యక్తి కూడా వినే అవకాశాలు […]

వాట్సాప్‌‌లో మరో కొత్త ఫీచర్.. ఏంటంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2019 | 8:15 AM

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది ఈ సంస్థ. ఇదివరకు వాట్సాప్‌లో మనం వీడియో లేదా మెసేజ్‌ను పంపేముందు ఒకసారి పరిశీలించుకునే అవకాశం ఉండేది. అయితే ఆడియో సందేశాలకు మాత్రం ఈ అవకాశం ఉండేది కాదు. మనం రికార్డు చేసినవి పంపితే.. అవి తిరిగి మనం వినే లోపు అవతల వ్యక్తి కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రికార్డింగ్‌లలో పొరపాట్లు కూడా జరిగేవి. ఇప్పుడు ఈ ఇబ్బందిని వాట్సాప్ సంస్థ తొలగించాలనుకుంటోంది. ఆడియో రికార్డింగ్ సందేశం పంపేముందు ఒకసారి దాన్ని సరిచూసుకునేవిధంగా యాప్‌లో మార్పులు తీసుకువస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐవోఎస్‌లో బేటా దశలో ఉండగా.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.