Whatsapp Chat Backup: వాట్సాప్ యూజర్లకు మరో సూపర్ ఫీచర్.. ఇకపై చాట్స్ బ్యాకప్‌లోనూ ఆ ఫీచర్.
Whatsapp Chat Backup: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి వరసులో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు తీసుకురావడం, యూజర్ల అవసరాలను..
Whatsapp Chat Backup: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి వరసులో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు తీసుకురావడం, యూజర్ల అవసరాలను తీర్చడమే దీనికి కారణం. ఇక మరీ ముఖ్యంగా ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్ తీసుకొచ్చిన కొన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఈ యాప్‌ను మొదటి స్థానంలో నిలిపాయి. ఈ క్రమంలోనే మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.
ఇప్పటి వరకు యూజర్లు చేసిన చాటింగ్‌కు సంబంధించిన ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ ఉన్న విషయం తెలిసిందే. అంటే మెసేజ్ పంపించే యూజర్‌కు, రిసీవ్ చేసుకునే వారు తప్ప మరెవరూ మెసేజ్‌లను చూడడానికి అవకాశం ఉండదు. ఇప్పటివరకు కేవలం మెసేజ్‌లకు మాత్రమే ఉన్న అవకాశాన్నివాట్సాప్ తాజాగా చాట్ బ్యాకప్స్ కోసం కూడా తీసుకొచ్చింది. గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్స్ లో చాట్ బ్యాకప్స్ ను స్టోర్ చేసుకునే వాళ్ల బ్యాకప్స్ ఇక నుంచి సురక్షితంగా ఉండనున్నాయి. దీని వల్ల గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు ఆ చాట్ బ్యాకప్స్ ను ఓపెన్ చేయలేవు. ఈ ఫీచర్ ను ప్రపంచవ్యాప్తంగా గూగుల్, ఐవోఎస్ యూజర్ల కోసం వాట్సప్ తీసుకొచ్చింది.
ఇంతకీ ఆప్షన్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ఇందుకోసం ముందుగా.. సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్స్, చాట్ బ్యాకప్స్, ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ బ్యాకప్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యూజర్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ అనే కీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తిరిగి ఆ చాట్ బ్యాకప్స్ ను పొందాలంటే ఖచ్చితంగా అదే పాస్ వర్డ్ తో ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
Also Read: AP Open School: ఏపీ ఓపెన్ స్కూల్ దరఖాస్తుకు 25 వరకు గడువు.. పూర్తి వివరాలు
ప్రేమంటే ఇదే.. అప్యాయంగా ఫారెస్ట్ ఆఫీసర్‌ను కౌగిలించుకున్న పిల్ల ఏనుగు.. హత్తుకుంటున్న ఫోటో..