WhatsApp Block: మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యిందా..? అన్‌బ్లాక్ కోసం ఏం చేయాలో తెలుసా?
WhatsApp Block: యూజర్ ప్రైవసీని కాపాడేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు యాప్‌లో కీలక మార్పులు తీసుకువస్తుంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు చేపడుతుంటుంది. యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొన్ని ఫీచర్లను అప్‌డేట్ చేస్తుంది. వాట్సాప్ వినియోగదారులను దుర్వినియోగం చేసిన వారి వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేస్తుంటుంది..

WhatsApp Block: నంబర్ వన్ మెసేజింగ్ అప్లికేషన్ అయిన వాట్సాప్‌ను నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వాట్సాప్ తమదైన చర్యలు చేపడుతూనే ఉంది. దీంతో ప్రతి నెల వాట్సాప్ చాలా మంది అకౌంట్లపై నిషేధం విధిస్తూనే ఉంది. వాట్సాప్ సంస్థ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరఢా ఝులిపిస్తుంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాట్సాప్ అకౌంట్స్‌ను బ్లాక్ చేస్తుంటుంది. మరి అకౌంట్ బ్లాక్ అయితే ఏం చేయాలి..? ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం..
వాట్సాప్ సంస్థ అకౌంట్ ఎందుకు బ్యాన్ చేస్తుంది?
యూజర్ ప్రైవసీని కాపాడేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు యాప్‌లో కీలక మార్పులు తీసుకువస్తుంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు చేపడుతుంటుంది. యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొన్ని ఫీచర్లను అప్‌డేట్ చేస్తుంది. వాట్సాప్ వినియోగదారులను దుర్వినియోగం చేసిన వారి ఖాతాలను కూడా బ్లాక్ చేస్తుంది. WhatsApp పాలసీని ఉల్లంఘిస్తే, కంపెనీ ఖాతాను బ్లాక్ చేస్తుంది లేదా బ్యాన్ చేస్తుంది. అయితే, చాలా సందర్భాలలో వ్యక్తుల వాట్సాప్ ఖాతాలను ఎటువంటి పొరపాటు లేకుండా నిషేధించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ ఖాతా కూడా ఎటువంటి పొరపాటు లేకుండా నిషేధించబడితే చింతించకండి. ఈ ప్రక్రియను అనుసరించి సమస్య పరిష్కారం చేసుకోవచ్చు.
మీ వాట్సాప్ అకౌంట్‌ను నిషేధిస్తే నోటిషికేషన్ అందుతుంది:
మీ WhatsApp ఖాతా నిషేధించబడినప్పుడు మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీ ఖాతా ఎందుకు నిషేధించబడిందో ఈ నోటీసు వివరిస్తుంది. వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం. సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే సందేశాలను పంపడం, WhatsApp ద్వారా అభ్యంతరకరమైన సమాచారాన్ని పంచుకోవడం మొదలైన వాటి కోసం మీ ఖాతా బ్లాక్ చేయవచ్చు.
పొరపాటున నిషేధిస్తే ఏం చేయాలి?
మీ వాట్సాప్ ఖాతా పొరపాటున నిషేధించబడితే మీరు వాట్సాప్ మద్దతు బృందాన్ని సంప్రదించవచ్చు. యాప్‌కి వెళ్లి, ‘HELP’ ఎంపికపై క్లిక్ చేయండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యను ఇమెయిల్ ద్వారా నివేదించవచ్చు. మీ సంప్రదింపు నంబర్, పూర్తి వివరాలు, మీ ఖాతాను నిషేధించడానికి గల కారణాన్ని ఇమెయిల్‌లో పంపండి. కొన్నిసార్లు వాట్సాప్ మీ ఖాతాను తాత్కాలికంగా నిషేధించవచ్చు. ఈ పరిమితిని 24 గంటల నుండి 30 రోజులలోపు పరిష్కరించవచ్చు. మీరు ఈ కాలంలో GBWhatsApp, WhatsApp Plus వంటి థర్డ్ పార్టీ వాట్సాప్‌ని ఉపయోగించకూడదు. ఈ తాత్కాలిక నిషేధానికి ఈ వేదికలు కూడా కారణం అవుతాయి.
జనవరిలో 9.9 మిలియన్ల అకౌంట్లపై నిషేధం:
ఇదిలా ఉండగా.. వాట్సాప్‌కు భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. అయితే, ఇప్పుడు షాకింగ్ సమాచారం బయటపడింది. ఈ ఏడాది జనవరిలో 9.9 మిలియన్ ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తన నెలవారీ నివేదికలో తెలిపింది. పెరుగుతున్న స్కామ్‌లు, స్పామ్, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆపడానికి ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఏదైనా వినియోగదారు నిబంధనలను ఉల్లంఘిస్తే, భవిష్యత్తులో మరిన్ని ఖాతాలు నిషేధించబడతాయని మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ తెలిపింది.
ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 30 వరకు మొత్తం 99 లక్షల 67 వేల ఖాతాలను బ్లాక్ చేసినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో 13.27 లక్షల ఖాతాలను ఎటువంటి ఫిర్యాదు అందకముందే నిషేధించారు. జనవరిలో వాట్సాప్‌కు దాని వినియోగదారుల నుండి 9,474 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 239 ఖాతాలపై కంపెనీ చర్యలు తీసుకుంది. ఖాతాలను బ్లాక్ చేయడంతో సహా ఇతర చర్యలు తీసుకుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి