Pagers: పేజర్స్ అంటే ఏంటి.? వీటిని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.?

ఇదిలా ఉంటే ఈ కాలం వారికి ఈ పేజర్స్‌ గురించి పెద్దగా తెలియదు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ ఇలాంటి ఓ పరికరాన్ని ఉపయోగిస్తాడు. అయితే ఈ పేజర్స్‌ను 1990 సమయంలో ఎక్కువగా ఉపయోగించే వారు. ప్రస్తుతం జరిగిన పేలుళ్లతో అసలేంటీ పేజర్స్‌.? వీటి ఉపయోగం ఏంటి.? అన్న ప్రశ్నలకు వస్తున్నాయి. మరి ఈ పేజర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Pagers: పేజర్స్ అంటే ఏంటి.? వీటిని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.?
Pagers
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 19, 2024 | 9:14 AM

లెబనాన్‌, సిరియాలో మంగళవారం జరిగిన పేజర్ల పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా వేల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ఇజ్బుల్లా ఫైటర్స్‌ ఉపయోగిస్తున్న ఈ పేజర్లలో ఇజ్రాయిల్‌ నిఘా సంస్థ శక్తివంతమైన పేలుడు పదార్థాలను పెట్టి, రేడియో సిగ్నల్స్‌ ద్వారా పేల్చాయని వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్‌ నిఘా తప్పించుకోవడానికి ఇజ్బుల్లా ప్రతినిధులు వీటిని ఉపయోగిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ కాలం వారికి ఈ పేజర్స్‌ గురించి పెద్దగా తెలియదు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ ఇలాంటి ఓ పరికరాన్ని ఉపయోగిస్తాడు. అయితే ఈ పేజర్స్‌ను 1990 సమయంలో ఎక్కువగా ఉపయోగించే వారు. ప్రస్తుతం జరిగిన పేలుళ్లతో అసలేంటీ పేజర్స్‌.? వీటి ఉపయోగం ఏంటి.? అన్న ప్రశ్నలకు వస్తున్నాయి. మరి ఈ పేజర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పేజర్ అనేది ఒక చిన్న పోర్టబుల్ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌. మొబైల్ ఫోన్స్‌ అందుబాటులోకి రాని సమయంలో ఈ పేజర్స్‌ను ఉపయోగించే వారు. చిన్న చిన్న మెసేజ్‌లను పంపించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అవతలి వ్యక్తిని అలర్ట్ చేయడం, ఏదైనా చిన్న సందేశాన్ని పంపించేందుకు వీటిని ఉపయోగించేశారు. ఈ పేజర్లను వైద్యులు, నర్సులు మరియు అత్యవసర సేవల సిబ్బంది సెల్యులార్ నెట్‌వర్క్‌లపై ఆధారపడకుండా ఉండేందుకు ఉపయోగించేవారు. పేజర్స్‌లో రెండు రకాల ఉంటాయి. వీటిలో ఒకటి న్యూమరిక్ పేజర్. ఇందులో కేవలం నంబర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఏదైనా ఫోన్ నంబర్‌కు కాల్ చేయమని లేదా పేజ్‌కు స్పందించమని మెసేజ్ వస్తుంది.

ఇక మరో రకం టెక్ట్స్‌ పేజర్స్‌. వీటిలో చిన్న చిన్న సందేశాలను పంపుకోవచ్చు. మొబైల్ నెట్‌వర్క్‌తో పోల్చితే వీటికి ఎక్కువ కవరేజ్‌ ఏరియా ఉంటుంది. సెల్యూలర్‌ తక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా పేజర్‌ను ఉపయోగించుకోవచ్చు. పేజర్స్‌ను ఉపయోగించే వారి లోకేషన్‌ను ట్రాక్‌ చేయడం అసాధ్యం. అందుకే ప్రస్తుతం లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్‌ వీటిని ఉపయోగిస్తున్నాయి.

పేలిన పేజర్స్‌ ఎక్కడివి..

లెబనాన్‌లో పేలిన పేజర్స్‌ ఆల్ఫాన్యూమరిక్ పేజర్‌లుగా తెలుస్తోంది. ఈ పేజర్‌లను తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ లిమిటెడ్ తయారు చేసింది. అయితే ఈ పేజర్‌ల వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందని హిజ్బుల్లా అంటోంది. అయితే ఇజ్రాయిల్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ వార్తలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్త కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ