Hybrid Car: హైబ్రిడ్‌ కారు గురించి వినే ఉంటారు.. కానీ ప్రయోజనాలు తెలుసా..?

|

Jun 02, 2022 | 6:45 PM

Hybrid Car:ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో 'హైబ్రిడ్' అనే పదం చర్చల్లో ఉంది. చాలామందికి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కారు మధ్య తేడా తెలియదు. హైబ్రిడ్ కారు అంటే సంప్రదాయ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్‌

Hybrid Car: హైబ్రిడ్‌ కారు గురించి వినే ఉంటారు.. కానీ ప్రయోజనాలు తెలుసా..?
Hybrid Car
Follow us on

Hybrid Car:ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో ‘హైబ్రిడ్’ అనే పదం చర్చల్లో ఉంది. చాలామందికి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కారు మధ్య తేడా తెలియదు. హైబ్రిడ్ కారు అంటే సంప్రదాయ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్‌ ఇంజన్‌ కలయికగా చెప్పవచ్చు. ఇందులో పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే ఇంజన్‌కి ఒక ఎలక్ట్రిక్ మోటారు జతచేసి ఉంటుంది. కొన్ని హైబ్రిడ్ కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్లపై నడుస్తాయి. కొన్ని ఇంధన ఇంజిన్లతో నడుస్తాయి. కారులో ఈ రెండూ కలిసి పనిచేస్తాయి.హైబ్రిడ్ కారులో అధిక ఓల్టేజీ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది.

ఇది కారుకు మెరుగైన మైలేజీని అందిస్తుంది. హైబ్రిడ్ కారులో బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సంప్రదాయ ఇంజిన్‌ని ఉపయోగిస్తారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కార్ కంపెనీలు వివిధ రకాల హైబ్రిడ్ డిజైన్లను తయారుచేస్తున్నాయి. హైబ్రిడ్‌ కారులో ఎలక్ట్రిక్ మోటారు, ఇంధన ఇంజిన్ రెండు ఉంటాయి. కారుని ఇంధన ఇంజిన్‌తో పాటు, ఎలక్ట్రిక్ మోటారు ద్వారా కూడా నడపవచ్చు. కొన్ని వాటిలో కారు ఇంధన ఇంజిన్‌కు సహాయం చేయడానికి ఎలక్ట్రిక్ మోటారు ఉపయోగిస్తారు. ఈ డిజైన్ ఉద్దేశ్యం కారు ఇంధన పనితీరును మెరుగుపరచడం మాత్రమే. సాంప్రదాయ కార్ల కంటే హైబ్రిడ్ వాహనాల శక్తి సామర్థ్యం చాలా ఎక్కువ. ఇంకా హైబ్రిడ్ కావడం వల్ల ఇంధన వినియోగం, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చు.హైబ్రిడ్ కార్లు సంప్రదాయ వాహనంతో పోల్చినట్లయితే తక్కువ శక్తిని వినియోగిస్తాయి. తక్కువ విద్యుత్‌ని ఉపయోగిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి