Black Box: బ్లాక్‌బాక్స్‌ అంటే ఏమిటి? దీనిని విమానం వెనుక భాగంలో ఎందుకు అమరుస్తారు? దీని రహస్యం ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరగడానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదాల..

Black Box: బ్లాక్‌బాక్స్‌ అంటే ఏమిటి? దీనిని విమానం వెనుక భాగంలో ఎందుకు అమరుస్తారు? దీని రహస్యం ఏమిటి?
Black Box
Follow us
Subhash Goud

|

Updated on: Jan 15, 2023 | 6:38 PM

ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరగడానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదాల విషయం అటుంచితే.. సాధారణంగా విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్. దీని వల్లనే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలుస్తోంది. విచారణ అధికారులు కూడా ఈ బ్లాక్‌ బాక్స్‌పైనే ఆధారపడి ఉంటారు. ఇప్పటికే బ్లాక్ బాక్స్ అనేది ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను బయటపెట్టాయి. దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకీ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి..?

విమానం ప్రమాదానికి గురైందంటే అందుకు సంబంధించిన కారణాలు బ్లాక్‌ బాక్స్‌ ద్వారానే బట్టబయలవుతుంటాయి. అయితే బ్లాక్‌ బాక్స్‌ అంటే నలుపు రంగులో ఉంటుందనుకుంటే పొరపాటే. ఇది ఆరెంజ్‌ రంగులో ఉంటుంది. ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్‌ అయిత తర్వాత నుంచి ప్రతి విషయం కూడా ఈ బ్లాక్‌ బాక్స్‌లో రికార్డు అయి ఉంటుంది. ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇందులో రికార్డు అవుతుంటాయి. అంటే ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు. దీని ఆధారంగానే ప్రమాదంపై దర్యాప్తు కొనసాగిస్తారు. దీని వల్లనే అసలు విషయాలు బయటకు వస్తాయి. విమానం ప్రమాదం జరుగగానే ముందుగా అధికారులు ఈ బ్లాక్‌ బాక్స్‌ కోసమే వెతుకుతుంటారు.

బ్లాక్‌ బాక్స్‌ ఆరెంజ్‌ కలర్‌లో ఎందుకు ఉంటుంది?

అయితే బ్లాక్‌ బాక్స్‌ ఆరెంజ్‌ కలర్‌లో మాత్రమే ఉంటుంది. ఈ కలర్‌ ఎందుకు ఉంటుందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనుక కారణం కూడా ఉంది. సాధారణంగా విమాన ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగిన సమయంలో అన్ని కూడా కాలిబూడిదవుతుంటాయి. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్‌ బాక్స్‌ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే అందుకే బ్లాక్ బాక్స్‌కు ఆరెంజ్ కలర్ ఉంటుందని ఏవియేషన్‌ అధికారుల వివరాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ బాక్స్‌ విమానం వెనుక భాగంలో అమరుస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ బ్లాక్‌ బాక్స్‌ను విమానం వెనుక భాగంలో ఎందుకు అమరుస్తారు?

బ్లాక్ బాక్స్ వెనక భాగంలోనే అమరుస్తారు. ఇలా వెనుక భాగంలో అమర్చేందుకు కూడా కారణం ఉంది. ఈ బ్లాక్ బాక్స్‌ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా తొలగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే దీనిని డిజైన్‌ చేస్తారు. ఒక వేళ రాడర్‌ సిగ్నల్స్‌ అందని సమయంలో కూడా బ్లాక్‌ బాక్స్‌ మాత్రం పని చేస్తూనే ఉంటుంది. విమానం ప్రమాద సమయంలో అందులో ఉండే పైలట్‌, ఇతర ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు. పైలట్‌ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి సహాయం కోరాడు. తదితర విషయాలు ఇందులో రికార్డు అవుతుంటాయి. అయితే ఈ బ్లాక్‌ బాక్స్‌ వెనుకవైపు ఎందుకు అమరుస్తారంటే.. ఇక్కడ అమర్చడం వల్ల చాలా సురక్షితమని విమానయాన నిపుణులు చెబుతున్నారు. విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనక భాగం పెద్దగా ధ్వసం కాదు అందుకే ఇక్కడే బ్లాక్ బాక్స్‌ను అమరుస్తారని నిపుణుల ద్వారా తెలుస్తోంది. అయితే విమానంలో ఎంతో ఎంతో మంది ఉంటారు కనుక ప్రతి విమానంలో ఇలాంటి బ్లాక్‌ బాక్స్‌ ఉండాలని విమానాయాన రంగంలో ఒక చట్టంగా రూపొందించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారణాలు సులభంగా తెలుసుకోవచ్చనే దానిపై దీనిని ప్రతి విమానంలో అమర్చడం తప్పనిసరి చేసింది విమానయాన రంగం.

బ్లాక్‌ బాక్స్‌లో రెండు కీలక పరికరాలు:

విమానయాన రంగ నిపుణుల వివరాల ప్రకారం.. విమానంలో అమర్చే ఈ బ్లాక్‌ బాక్స్‌లో రెండు కీలక పరికరాలు ఉంటాయి. ఒకటి ఫ్లయిడ్‌ డేటా రికార్డ్‌ (ఎఫ్‌డీఆర్‌), మరొకటి కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌). ఫ్లయిడ్‌ డేటా రికార్డర్‌లో విమానంకు సంబంధించి పూర్తి వివరాలు రికర్డ్‌ అయి ఉంటాయి. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది..? ఎంత ఇంధనం ఉంది? ఇంజిన్‌కు సంబంధించిన విషయాలు పారామీటర్ల సమాచారం ఇందులో రికార్డు అయి ఉంటాయి. అంతేకాకుండా విమాన కదలికలను ఎప్పటికప్పుడు రికార్డు చేసి ఉంచుతుంది. విమాన పైలట్‌ ల్యాండింగ్‌ గేర్‌ ఎప్పుడు వేశారు.. గేర్‌ వేయడంలో ఏమైనా జాప్యం జరిగిందా? అనే విషయాలు తెలుస్తాయి. ఇక కాక్‌పిట్‌ విషయానికొస్తే ఇందులో విమాన పైలట్‌ వాయిస్‌ రికార్డు అవుతుంటుంది. పైలట్‌ సంభాషణ నుంచి ఏటీసీతో మాట్లాడిన ప్రతి విషయం కూడా రికార్డు చేస్తుంది. అందుకే విమాన ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు చేసే అధికారులు దీనినే ఆధారంగా తీసుకుంటారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా వివరాలు తెలుసుకున్నా పూర్తి దర్యాప్తు కోసం బ్లాక్‌బాక్స్‌ను ఆధారంగా చేసుకుంటారు. దీని ద్వారా అసలు విషయాలు బయటకు వస్తాయి.

ఆ అరగంటే కీలకం

ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఏం జరిగిందనేది కీలకం. ప్రమాదం జరిగే సమయంలో పైలట్‌ ఏటీసీకి ఏమైనా తెలిపారా..? ఎలాంటి విషయాలు మాట్లాడారు? అనే విషయాలు రికార్డు అవుతాయి. ప్రమాదం జరిగిన తర్వాత బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైన తర్వాత డీకోడ్‌ చేస్తారు. బ్లాక్‌బాక్స్‌ 13 గంటల పాటు నిడివి ఉన్న డేటాను రికార్డు చేస్తుంది. ఇదన్నట్లు సంగతి. బ్లాక్‌బాక్స్‌ ప్రమాద విషయాన్ని గుట్టు విప్పే పరికరం అని.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి